పేదల ఆత్మబంధువు సీఎం కేసీఆర్‌:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) పేదలకు అందిస్తున్న వరం గృహలక్ష్మి పథకమని సూర్యాపేట ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

సూర్యాపేట నియోజకవర్గంలో గృహలక్ష్మి లబ్ధిదారుల నూతన గృహాలకు శంకు స్థాపన చేసిన మంత్రి, మంజూరు పత్రాల పంపిణి చేశారు.

సూర్యాపేట రూరల్ మండలం యర్కారంలో చింతా రేవతి,చివ్వెంల మండలం మున్యా నాయక్ తండాలో బానోతు లింగిలకు గృహ లక్ష్మీ ద్వారా మంజూరు అయిన నూతన ఇళ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం ఇరు గ్రామాల్లో 97మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు పండుగ వాతావరణంలో మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చిన మహానుభావుడు, ఆత్మబంధువు సీఎం కేసీఆర్‌ అన్నారు.రాష్ట్రంలో ఇళ్లు లేని వారు ఉండకూడదు అనేదే కేసీఆర్ ఆకాంక్ష అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి వర్తింపజేస్తాం అన్నారు.ముఖ్యమంత్రి మానస పుత్రిక గృహ లక్ష్మి ( Gruhalakshmi )పథకమని పేర్కొన్నారు.

Advertisement

గృహలక్ష్మి పథకం నిరంతరం ప్రక్రియ అన్నారు.తెలంగాణలో సంపద పెంచి,పేదలకు పంచడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం అన్నారు.

అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శం గా ఉందన్నారు.బీఆర్‌ఎస్‌ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అన్నారు.

పార్టీల కతీతమైన ప్రజాసంక్షేమమే బీఆర్ఎస్ ప్రధాన ఎజెండా అన్నారు.గత పాలకుల హయాంలో గ్రామాలకు లక్ష రూపాయల నిధులు తేవాలంటే సాధ్యం కాని దారుణమైన పరిస్తితులు ఉంటే,కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్లు,రైతుబంధు,బీమా, కళ్యాణ లక్ష్మి,బిసి బంధు, వంటి సంక్షేమ పథకాల కోసం నెలకు లక్షలాది రూపాయలను 10 ఏళ్లలో ఒక్కో గ్రామానికి కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు.

నిత్యం పేదల సంక్షేమం కోసం ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు.ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు,ప్రతి గడపకూ సంక్షేమ పథకం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
అనంతగిరి మండలంలో మంత్రాల నెపంతో వృద్ధురాలు ఆటవిక హత్య

దేశంలో కాంగ్రెస్,బిజెపిలు పాలిస్తున్న రాష్ట్రాల్లో నేటికీ కనీస సౌకర్యాలు లేవన్నారు.మన రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తుంటే, గుజరాత్,రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో వ్యవసాయానికి ఇచ్చేది కేవలం 4గంటలు మాత్రమే అన్నారు.

Advertisement

రైతులకు రుణ మాఫీ( Rythu Runamafi ) చేసిన ప్రభుత్వం దేశంలో బీఆర్ఎస్ మాత్రమే అన్నారు.బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్న పెన్షన్లు నెలకు మూడు నుండి 6వందలు మాత్రమే అన్నారు.

చెప్పినవి చెప్పినట్లు చేసిన నాయకుడు దేశంలో కేసీఆర్ మాత్రమే అన్నారు.ఇచ్చి ప్రతీ మాటను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేల మేరు వేసిన ఓటు ద్వారా ఏమి వచ్చిందో ఆలోచన చేయాలని కోరారు.సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు రూ 3 లక్షల ఆర్ధిక సాయం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు.సూర్యాపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్లగొండ జి( Nalgonda )ల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్లు చొప్పున 36 వేల ఇండ్లు,రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ.7,350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.దీని వల్ల మొత్తం 4 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని మంత్రి పేర్కొన్నారు.

జీవితాల్లో వెలుగులు నింపే కేసీఆర్ కు మద్దతుగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వీ, సూర్యాపేట,చివ్వెంల ఎంపిపిలు రవీందర్ రెడ్డి, కుమారి బాబు నాయక్, జెడ్పీటీసీలు జీడి భిక్షం, సంజీవ నాయక్,మండల పార్టీ అధ్యక్షులు వంగాల శ్రీనివాస్ రెడ్డి,జూలకంటి జీవన్ రెడ్డి,మద్ది శ్రీనివాస్ నాయుడు,రౌతు నర్సింహ రావ్,సింగిల్ విండో చైర్మన్ సుదీర్ రావ్,జూలకంటి సుధాకర్ రెడ్డి,మాలి అనంతరెడ్డి,మామిడి కిరణ్,బొడ్డు కిరణ్ యాదవ్ సర్పంచ్ లు మధు,బికారు నాయక్,ఎంపిటిసిలు శాంతభాయ్,సుశీలసాగర్ నాయక్,బాలాజీ నాయక్, సత్యం,మనోజ్ నాయక్, సుమన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Latest Suryapet News