సలార్‌ కి కేజీఎఫ్‌ రిలీజ్‌ ఫార్ములా వర్తింపజేస్తున్నావా ప్రశాంత్‌..?

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమా( KGF movie ) తో పాన్ ఇండియా స్టార్ దర్శకుడిగా మారి పోయాడు.ఆ సినిమా రెండవ భాగం ఏకంగా రూ.1000 కోట్ల మైలు రాయిని క్రాస్ చేయ డంతో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగి పోయింది.అందుకే ప్రస్తుతం సలార్ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Prashanth Neel Following Kgf Release Plans For Salaar , Prashanth Neel , Sala-TeluguStop.com

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా( Salaar movie ) ఈ నెల లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

Telugu Salaar, Kgf, Prabhas, Prashanth Neel, Rebel, Tollywood-Movie

ఆలస్యంకు కారణం ఏంటి అంటే స్పష్టం గా తెలియడం లేదు.కానీ కన్నడ సినీ వర్గాల్లో మరియు తెలుగు సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం పబ్లిసిటీ కోసమే సినిమా ను వాయిదా వేస్తున్నారు అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.ఆ మధ్య కేజీఎఫ్ 2 విషయం లో కూడా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఇలాగే చేశాడు.

ఎంత ఆలస్యమైతే సినిమా కు అంత పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నాడు.అందుకే సలార్‌ సినిమా అంతా రెడీ గా ఉన్నా కూడా విడుదల విషయం లో మీన మేషాలు లెక్కిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నాడు.

Telugu Salaar, Kgf, Prabhas, Prashanth Neel, Rebel, Tollywood-Movie

ఈ విషయం లో దర్శకుడు ప్రశాంత్ నీల్‌( Prashanth neel ) అనుసరిస్తున్న విధానం ను ప్రభాస్‌ అభిమానులు తప్పు పట్టడం లేదు.సినిమా కు బజ్ క్రియేట్ అయితే రూ.1000 కోట్లు ఈజీగా రాబట్టగలదు.అందుకే ప్రశాంత్ నీల్ ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు చూస్తాం అన్నట్లుగా ప్రభాస్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

అంతే కానీ ఇంకెప్పుడు విడుదల చేస్తావు అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించడం లేదు.సలార్‌ ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.

మొత్తానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) మరో సారి 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube