భగవంత్ కేసరి.. కాజల్ కంటే శ్రీలీలకు ఎక్కువ!

నందమూరి బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వం లో రూపొందుతున్న భగవంత్‌ కేసరి సినిమా( Bhagavanth Kesari movie ) షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.దసరా కానుకగా ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

 Balakrishna Heroine Kajal Remuneration Less Than Sreeleela , Anil Ravipudi ,-TeluguStop.com

ఈ సినిమా లో బాలకృష్ణ కు జోడి గా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే ఇక ఈ సినిమా లో కీలక పాత్ర లో టాలీవుడ్ హాట్ లేడీ క్రేజీ బ్యూటీ శ్రీ లీల కనిపించబోతోంది సాధారణంగా ఏ సినిమా లో అయినా హీరో తర్వాత అత్యధిక పారితోషికం హీరోయిన్ అందుకుంటుంది.

కానీ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal )కంటే కూడా అధికంగా కీలక పాత్ర లో నటిస్తున్న శ్రీ లీల అందుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది.దాదాపుగా రెండు కోట్లకు పైగా పారితోషికం నిర్మాతలు ఈమెకు అందిస్తున్నారని.కాజల్ అగర్వాల్ కి కేవలం కోటి రూపాయల వారితోషికం మాత్రమే అందుతుందని తెలుస్తోంది.

శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.అందుకే ఆమె ఈ సినిమా లో హీరోయిన్ కాకున్నా అంతటి పారితోషికం ఇస్తున్నారని ఆమె సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతుంది.

ఇక ఈ సినిమా లో బాలకృష్ణ( Balakrishna ) కి ఆమె కూతురు పాత్ర లో కనిపించబోతుందని మొదటి నుండి వార్తలు వస్తున్నాయి.అయితే కూతురు కాదు అంటూ కొందరు వాదిస్తున్నారు.అసలు విషయం ఏంటి తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.బాలయ్య వరుసగా రెండు సినిమా లతో భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు.

కనుక ఈ సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube