భారత్ లో జరుగుతున్న జీ20 సదస్సులో ప్రపంచంలోని 20 అగ్రదేశాల దేశాధినేతలు పాల్గొన్న సంగతి తెలిసిందే.అయితే తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన చేనేత కార్మికుడు హరి ప్రసాద్ ( Hari Prasad )జీ20 దేశాల అధ్యక్షులు ఫోటోలతో పాటు జాతీయ జెండా రంగులో ఉండే భారతదేశం మ్యాప్ ను వస్త్రంపై తయారు చేశాడు.
ఈ భారతదేశం మ్యాప్ లో ప్రధాని నరేంద్ర మోడీ ( Prime Minister Narendra Modi )నమస్తే పెడుతూ స్వాగతం పలుకుతున్న చిత్రం తయారు చేశాడు.హరి ప్రసాద్ చేనేత రంగంలో ఎంతో నైపుణ్యం సాధించాడు.
గతంలో వస్త్రాలపై ఎన్నో అద్భుతాలను రూపొందించాడు.రెండు మీటర్ల వస్త్రంలో ఇరుప్రక్కల జీ20 లోగో వచ్చే విధంగా.
మధ్యలో జీ20 దేశాధినేతల ఫోటోలు, భారతదేశం మ్యాప్ వచ్చే విధంగా తయారుచేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

హరి ప్రసాద్ ఒక వారం రోజులపాటు శ్రమించి మర మగ్గంపై చేతితో ఈ వస్త్రాన్ని ప్రత్యేకంగా తయారు చేశాడు.గతంలో జీ20 లోగో ను వస్త్రం పై తయారుచేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపించాడు.గతంలో మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ( Mann Ki Baath programme )పాల్గొన్న నరేంద్ర మోడీ జీ20 లోగో గురించి ప్రస్తావించడం జరిగింది.
ప్రస్తుతం జీ20 దేశాల అగ్ర నాయకుల ఫోటోలు, భారతదేశ మ్యాప్, నరేంద్ర మోడీ ఫోటో వస్త్రంపై తయారుచేశాడు.హరి ప్రసాద్ మాట్లాడుతూ గతంలో తాను ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు వస్త్రంపై తయారు చేశానని, తెలంగాణ ప్రభుత్వం సహాయక సహకారాలు అందిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు వస్త్రాలపై చేసి తెలంగాణ కీర్తి ప్రపంచవ్యాప్తంగా నిలుపుతానని హరిప్రసాద్ చెప్పాడు.







