సినిమా ఇండస్ట్రీకి చెందిన దర్శకులు సినిమా సినిమాకు అప్ డేట్ అవుతూ ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తే మాత్రమే ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు.ఒక్క సినిమా ఫ్లాప్ అయినా ఆ దర్శకుని క్రేజ్ అమాంతం తగ్గుతుందనే సంగతి తెలిసిందే.
అయితే భారతీయ సినీ ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ కూడా తెలియకుండా చరిత్ర సృష్టించిన దర్శకులు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
రాజమౌళి, ప్రశాంత్ నీల్, అట్లీ ( Rajamouli, Prashanth Neel, Atlee )ఈ జాబితాలో ఉన్నారు.
కొంతకాలం క్రితం వరకు కొరటాల శివ కూడా ఈ జాబితాలో ఉన్నా ఆచార్య సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో కొరటాల శివ ఈ జాబితాలో చోటు కోల్పోయారు.షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) డైరెక్షన్ లో తెరకెక్కిన జవాన్ ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
అట్లీ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది.

అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ విజయం సాధించాయి.రాజా రాణి, తేరి, మెర్సల్, బిగిల్, జవాన్ సినిమాలతో అట్లీ బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్నారు.కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ మా నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్నారు.
వరుణ్ డాక్టర్, బీస్ట్(కమర్షియల్ లెక్కల ప్రకారం) , జైలర్ సినిమాలతో నెల్సన్ దిలీప్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్నారు.

స్టూడెంట్ నంబర్1 సినిమా నుంచి ఆర్.ఆర్.ఆర్( RRR ) వరకు జక్కన్న ప్రతి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.ఉగ్రం, కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలతో ప్రశాంత్ నీల్ భారీ విజయాలను సొంతం చేసుకున్నారు.మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్ కుంజి రామాయణం, గోదా, మిన్నల్ మురళి సినిమాలతో విజయాలను అందుకున్నారు.
కన్నడ ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి కాంతార బ్లాక్ బస్టర్ హిట్ తో వార్తల్లో నిలిచారు.టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
రాబోయే రోజుల్లో ఈ జాబితాలో మరి కొందరు దర్శకులు చేరాలని ఆశిద్దాం.







