యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్( Singapore ) దేశాలలో 60% మంది ఎన్నారైలు పదవీ విరమణ తర్వాత ఇండియాలో జీవితం గడపాలని భావిస్తున్నట్లు రీసెంట్ సర్వేలో తేలింది.స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, తక్కువ జీవన వ్యయం, బలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కారణంగా పదవీ విరమణ చేసే ఎన్నారైలకు భారత్ ఉత్తమమైన గమ్యస్థానంగా మారుతోందని సదరు సర్వే వెల్లడించింది.
నిజానికి చాలా మంది ఎన్నారైలు తమ పోస్ట్-రిటైర్‌మెంట్ లైఫ్ భారతదేశంలోని( India ) వారి కుటుంబాలు, స్నేహితులతో గడపాలని చూస్తున్నారు.
ఇక 72% మంది ఎన్నారైలు భారతదేశం స్థిరమైన పెట్టుబడి మార్గమని విశ్వసిస్తున్నట్లు సర్వే కనుగొంది.
ప్రస్తుతం బలమైన ఆర్థిక వృద్ధితో ఇండియా గ్లోబల్ పవర్‌గా మారుతోంది.భవిష్యత్‌లో కూడా వృద్ధి సాధించే సామర్థ్యం ఉంది.
అందుకే, చాలా మంది ఎన్నారైలు తమ రిటైర్‌మెంట్ ప్లాన్లకు మద్దతుగా ఇప్పటికే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.ఎన్నారైల అవసరాలను తీర్చే ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ అయిన SBNRI ఈ సర్వేను నిర్వహించింది.
ఈ సర్వేలో పైన పేర్కొన్న ఐదు దేశాలకు చెందిన 100 మంది ఎన్నారైలు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.ఎన్నారైలు పదవీ విరమణ తర్వాత ఇండియాకి తిరిగి రావడానికి గల 4 కారణాలు ఏవో వివరంగా తెలుసుకుందాం.

స్థిరమైన ఆర్థిక వ్యవస్థ
: ముందుగా చెప్పుకున్నట్లు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇటీవలి సంవత్సరాలలో స్థిరంగా వృద్ధి చెందుతోంది.భవిష్యత్తులోనూ వృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి.ఇది పెట్టుబడి పెట్టడానికి, పదవీ విరమణ చేయడానికి భారతదేశాన్ని సురక్షితమైన ప్రదేశంగా చేస్తుంది.
తక్కువ జీవన వ్యయం:
భారతదేశంలో జీవన వ్యయం వెస్ట్రన్ కంట్రీస్ కంటే చాలా తక్కువగా ఉంది.అంటే ఎన్నారైలు తమ పదవీ విరమణ పొదుపుతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా జీవించవచ్చు.

బలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ:
భారతదేశంలో తక్కువ ధరల్లోనే వైద్యం దొరుకుతుంది.పదవీ విరమణ సంవత్సరాలలో క్వాలిటీ హెల్త్ కేర్ పొందాల్సిన ఎన్నారైలకు ఇది చాలా ముఖ్యం.
కుటుంబం, స్నేహితులు:
చాలా మంది ఎన్నారైలు భారతదేశంలోని తమ కుటుంబాలు, స్నేహితులతో సమయం గడపాలని కోరుకుంటున్నారు.భారతదేశం సుసంపన్నమైన సంస్కృతికి నిలయం కాబట్టి ఎన్నారైలు తమకు నచ్చే సంఘాన్ని కనుగొనగలరు.

మొత్తంమీద, ఎన్నారైలకు భారతదేశం మరింత ఆకర్షణీయమైన పదవీ విరమణ గమ్యస్థానంగా మారుతుందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.దేశ స్థిరమైన ఆర్థిక వ్యవస్థ( Economic system ), తక్కువ జీవన వ్యయం, బలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, సాంస్కృతిక వైవిధ్యం వంటివన్నీ ఎన్నారైలను భారతదేశానికి తిరిగి వచ్చేలా ఎన్నారైలను ప్రోత్సహిస్తున్నాయి.







