Krishna Mallidi : బేబీ సినిమలోలా రియల్ లైఫ్ లో అమ్మాయి చేతిలో మోసపోయా.. బేబీ నటుడి సంచలన వ్యాఖ్యలు!

ఆనంద్ దేవరకొండ,( Anand Deverakonda )వైష్ణవి చైతన్య కలిసి నటించిన బేబీ సినిమా ( Baby movie )గత నెల విడుదలైన విషయం అందరికీ తెలిసిందే.ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా పాజిటివ్ టాక్ ని తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది.

 Baby Cinema Vaishnavi Husband Charector Real Life-TeluguStop.com

సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు చాలా రోజులు అవుతున్న కూడా ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన చర్చలు నడుస్తూనే ఉన్నాయి.ముఖ్యంగా ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు.

Telugu Baby, Krishna Mallidi-Movie

ఇక ఒకరితో ప్రేమలో ఉండి మరొకరితో శారీరికంగా దగ్గరైన వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) క్లైమాక్స్‌లో మాత్రం ఆ ఇద్దరూ కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది.ఆ వ్యక్తి కేవలం ఒకే ఒక షాట్ లో కనిపించినా మీమర్స్ కి మంచి స్టఫ్ అయ్యాడు.పెళ్లి చేసుకునే వారందరినీ ఆలోచింప చేసిన ఆ వ్యక్తి పేరు కృష్ణ మల్లిడి( Krishna mallidi ) .బింబిసార డైరెక్టర్ వశిష్ట సోదరుడైన కృష్ణ డైరెక్టర్‌ అవుదామనుకుని నటుడిని అయ్యానని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.బేబి సినిమాలో లాగే తన నిజజీవితంలో కూడా తనను ఒక అమ్మాయి మోసం చేసిందని తన లైఫులో లైఫ్ లో మొత్తం మూడు బ్రేకప్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు.బేబి సినిమాలో లాగే ఒక అమ్మాయి నన్ను మోసం చేసిందని అప్పటి నుంచే తనకు ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోయిందని ఆయన చెప్పుకొచ్చాడు.

Telugu Baby, Krishna Mallidi-Movie

తాను లవ్ చేసిన అమ్మాయి నాతో పాటు మరో అబ్బాయిని ఒకేసారి డేటింగ్‌ చేసిందని, ఈ విషయం నాకు తెలిసిన తర్వాత కూడా నేను ఆమెను వదిలేయాలనుకోలేదు.అందరినీ వదిలేసి నేను నీ ఒక్కదాని గురించే పిచ్చోడిలా ఆలోచించా, నా మనసంతా నువ్వే నిండిపోయావని చెప్పి అడిగితే ఆమె మరో అబ్బాయిని వదిలేయడానికి రెడీగా లేదని తెలిసి ఇద్దరితో ఉండమని బతిమాలాడాను అని అన్నారు.మూడు నెలల పాటు ఆమె నాతో, మరొకరితో ఉండడంతో ఆ టైంలో నరకం అనుభవించానని సూసైడ్ చేసుకోవాలని కూడా అనిపించిందని అన్నారు.నా భార్యగా ఊహించుకున్న అమ్మాయి మరొకరితో ఉంటుందంటే ఆ బాధ భరించలేక ఒకరోజు ఆమెను తిట్టేసి బ్రేకప్‌ చెప్పేశానని అన్నారు.

అప్పుడు మా నాన్న నాకు అండగా ఉన్నాడని ఆయన ధైర్యంతోనే మళ్ళీ మామూలు మనిషిని అయ్యాను అని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube