రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజకీయాల్లో యువత ద్వారా పెను మార్పులు సాధ్యం అని డీసీసీ అధ్యక్షుడు అది శ్రీనివాస్ అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజున పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని,రాజకీయాల్లో మార్పులు యువత ద్వారానే సాధ్యం అన్నారు.
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ బడుగు బలహీన వర్గాల కు గ్రామంలో ఏవిధమైన సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా సామాజిక దృక్పథంతో ప్రజలకు సేవ చేయడానికి యువత ముందు ఉండాలని పిలుపునిచ్చారు.
యువశక్తి తలుచుకుంటే కాదంటూ ఏది లేదని యువకులు రాజకీయంగా,అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వహయాంలోనే అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు.అందరు కలిసి ఐక్యంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
పార్టీలో చేరిన వారిలో గండి అశోక్, నరేందర్, సాయి, ప్రవీణ్, జలంధర్, మధు తదితరులున్నారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ,డిసిసి కార్యదర్శి చేలుకల తిరుపతి,గంధం మనోజ్, పల్లి గంగాధర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.







