కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలపై భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని జేకేఎన్సీ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.ఎన్నికల కమిషన్ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది.
ఎన్నికల కమిషన్ నిర్ణయాల వలనే రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు అన్యాయం జరిగితే కోర్టులు చూస్తూ ఊరుకోవని స్పష్టం చేసింది.రాజకీయ పార్టీలు అన్నింటికీ సమాన అవకాశాలు కల్పించకపోతే ఎన్నికలు న్యాయంగా ఎలా జరుగుతాయని ధర్మాసనం ప్రశ్నించింది.