రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని మూడు గ్రామాలలో సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు.నారాయణపూర్ గ్రామానికి చెందిన ఆవునూరి శివ నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందగా భార్య శ్రావణి, తల్లి రాజవ్వలను పరామర్శించారు.
మృతునికి ఒక కొడుకు ప్రణీత్ ఉన్నారు.అదేవిధంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గొర్రె రాజం ఆకస్మికంగా మృతిచెందగా రాజం భార్య రాజవ్వ,కూతురు రేఖలను పరామర్శించారు.
రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గుండ్ల కాశయ్య నాలుగు రోజుల క్రితం హఠన్ మరణం చెందగా భార్య నాగవ్వ, కుమారులు నరసయ్య, దాసు రాజులను పరామర్శించారు, వీరి వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రఫీక్ , నాయకులు దొమ్మాటి నరసయ్య, చెన్ని బాబు, గుండాటి రామ్ రెడ్డి, సిరిసిల్ల సురేష్, దండు శ్రీనివాస్,భీమయ్య, సిరిపురం మహేందర్, దొమ్మాటి రాజు ,మోతే లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.