ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోల మార్కెట్ తెలుగు లో కాకుండా ఎవరికీ ఎక్కడ ఎక్కువ మార్కెట్ ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం…ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో అల్లు అర్జున్ ( Allu Arjun )కి మలయాళం లో మంచి మార్కెట్ ఉంది ఈయన ని అక్కడ ఇప్పటికే మల్లు అర్జున్ అని కూడా పిలుస్తారు పుష్ప సినిమాతో అల్లు అర్జున పాన్ ఇండియా హీరో అయిన విషయం మనకు తెలిసిందే.
కానీ ఈయన పాన్ ఇండియా హీరో అవ్వడానికి ముందు కూడా మలయాళం లో ఈయన కి మంచి మార్కెట్ ఉంది.నిజానికి ఈయన చేసిన దేశ ముదురు, జులాయి, రేసుగుర్రం లాంటి సినిమాలు అక్కడ కూడ మంచి విజయాలను అందుకున్నాయి…ఇక జూనియర్ ఎన్టీయార్ ( JR ntr )కి జపాన్ లో మంచి మార్కెట్ ఉంటుంది నిజానికి తమిళ్ సూపర్ స్టార్ అయిన రజినీకాంత్( Rajinikanth ) కి అక్కడ ఎక్కువ మార్కెట్ ఉంటుంది.ఆయన నటించిన భాష సినిమా ( Basha )కానీ, ముత్తు సినిమా కానీ, నరసింహ సినిమా కానీ, శివాజీ సినిమా కానీ, రోబో లాంటి సినిమాలు అక్కడ మంచి విజయాలు సాధించాయి
అయితే ఆయన తర్వాత జపాన్ లో అంత మంచి మార్కెట్ ఉన్న సౌత్ ఇండియన్ హీరో ఎవరు అంటే అదీ ఎన్టీయార్ అనే చెప్పాలి అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీయార్ ఇద్దరు కూడా ఇంటర్నేషనల్ హీరోలుగా మంచి గుర్తింపు పొందారు అనే చెప్పాలి…కానీ ఎన్టీయార్ పాన్ ఇండియా హీరో అవ్వడానికి ముందు కూడా అక్కడ ఆయన సినిమాలకి గాని ఆయన డాన్స్ లకి గాని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి.ఇలా మన తెలుగు హీరోలు పాన్ ఇండియా హీరో లు అవ్వడానికి ముందే వేరే భాషల్లో మంచి హిట్లు అందుకున్నారు…