తెలుగు లో ఉన్న ఆడియన్స్ అందరు కూడా తెలుగు సినిమా లనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ ఏ లాంగ్వేజ్ సినిమాలు బాగున్నా వాటిని చూస్తారు హిట్ చేస్తారు.అందుకే అక్కడి హీరోలకి ఇక్కడ కూడా మార్కెట్లు ఏర్పడుతున్నాయి వాళ్ళు కూడా మన స్టార్ హీరోలతో పాటు పోటీ పడుతున్నారు…అందుకే వాళ్ల రాష్ట్రాల్లో సరిగ్గా మార్కెట్ లేని హీరో లు కూడా మన తెలుగు లో పెద్ద పెద్ద హిట్లు కొడుతూ ఉంటారు.అలా బిచ్చగాడు సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టి ఇక్కడ తనకంటూ ఒక మార్కెట్ ఏర్పాటు చేసుకున్న హీరోనే విజయ్ ఆంటోని( Vijay Antony )…

ఇప్పటికే ఈయన చేసిన చాలా సినిమాలు తెలుగు లో రిలీజ్ అయ్యాయి నిజానికి ఈయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ హీరో గానే చాలా మంది కి పరిచయం అయ్యాడు ఇక రీసెంట్ గా ఆయన బిచ్చగాడు 2( Bichagadu 2 ) అనే సినిమా కూడా చేసాడు ఇది తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేదు అనే చెప్పాలి.అయినప్పటికీ ఆయన ఏ మాత్రం తగ్గకుండా మళ్లీ ఇంకో సినిమా తో మన ముందుకు వస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటె ఆయన తెలుగులో ఉన్న యంగ్ డైరెక్టర్లలతో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.అందులో భాగంగానే ఆయన రీసెంట్ గా బెదురులంక 2012 సినిమా( Bedurulanka 2012 ) తో ఒక మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ క్లాక్స్ తో ఒక సినిమా చేస్తున్నాడు అనే టాక్ బాగా వినిపిస్తుంది.ఇక అందులో భాగంగానే క్లాక్స్ విజయ్ ఆంటోని ని కలిసి ఒక కథ కూడా చెప్పినట్లు గా తెలుస్తుంది…

ఆయనకి ఈ కథ బాగా నచ్చడంతో ఆయన ఈ సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు గా తెలుస్తుంది.అయితే ఇది కూడా సస్పెన్సు థ్రిల్లర్ సినిమా కావడం తో విజయ్ ఆంటోని కి బాగా సెట్ అవుతుందని డైరెక్టర్ అనుకోని ఆయన కి ఈ కథ చెప్పడం అదీ ఆయన ఓకే చేయడం కూడా జరిగిపోయింది అని తెలుస్తుంది మరి ఈ సినిమా కి సంభందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో తెలియాల్సి ఉంది…








