Udayanidhi Stalin : ఉదయనిధి స్టాలిన్ పోయి పోయి ఇలా అగ్నికి ఆజ్యం ఎందుకు పోస్తున్నాడు ?

ఉదయనిధి స్టాలిన్( Udayanidhi stalin ) సనాతన ధర్మం అంటూ హిందువులపై నెగటివ్ వార్తల తో ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయాడు.తండ్రి స్టాలెన్ సీఎం కాబట్టి తానేది మాట్లాడిన నడుస్తుంది అనుకున్నాడో లేక అమాయకత్వంతో కూడిన వ్యాఖ్యలు చేశాడో అర్థం కాలేదు కానీ ప్రస్తుతం అందరూ స్టాలిన్( Stalin ) పై అలాగే అతడి కుటుంబం పై గుర్రుగా ఉన్నారు.

 Udayanidhi Stalin Is Provoking All-TeluguStop.com

ఓ పక్క హిందూ సంఘాలు కూడా ఉదయనిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.చాలా మంది ఆయన అభిమానులు కూడా ఉదయనిది స్టాలిన్ వ్యాఖ్యలపై కోపంగానే ఉన్నారు.

మరి ఇంత జరుగుతున్న ఉదయనిది ఇంకా మేలుకున్నట్టుగా కనిపించడం లేదు. పోయి నిప్పుతో చెలగాటమాడుతున్న విధంగా అతడి ప్రవర్తన ఉంటుంది.

Telugu Cm Stalin, Hindu, Hindu Dharma-Telugu Top Posts

ఈ రోజు కూడా కుల గజ్జి, హిందూ ధర్మం( Hindu Dharma ) కలిసి ఉన్నాయ్ అంటూ ఏదో విపరీత వ్యాఖ్యలు చేసి మళ్లీ అగ్నికి ఆజ్యం పోసినట్లు వ్యాక్యాలు చేస్తున్నాడు.ఈ స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల తమిళనాడులో తీవ్ర దుమారం చెలరేగుతోంది.మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ఉదయనిది ఏమైనా అమాయకుడా అంటే అది కాదు.హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొంత మంది దాన్ని ఆధారంగా చేసుకొని కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తున్న మాట వాస్తవం.

అయితే చెప్పాల్సిన విధానం మాత్రం బాగాలేదు.అందుకే ఈ హీరోపై ఇంత నెగటివ్( Negative ) గా ప్రచారం సాగుతుంది.ఉదయనిధి స్టాలిన్ జరుగుతున్న డ్యామేజీ గురుంచి ఆలోచించకుండా, తండ్రి స్థాయిని కూడా మర్చిపోయి ఇలా మాట్లాడం పట్ల సొంత పార్టీ లో కూడా వ్యతిరేఖత వస్తుంది.

Telugu Cm Stalin, Hindu, Hindu Dharma-Telugu Top Posts

మొదటి నుంచి క్రిస్టియన్( Christian ) పద్దతులతో పెరిగిన ఉదయనిధి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఇలా ప్రజల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ప్రవర్తించడం పార్టీ మనుగడను సైతం ప్రశ్నార్థకముగా చేస్తుంది.ఇక ఇప్పటికైనా ఉదయనిధి స్టాలిన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటాడా లేక దీనిని సౌత్ ఇండియా వ్యాప్తంగా హిందూ వర్సెస్ ఉదయనిధి అనే విధంగా మార్చుకుంటాడా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube