ఫిజిక్స్‌లో ఫెయిల్ అయిందని అంట్లు తోముకోమన్నారు.. కట్ చేస్తే ఫోర్బ్స్‌లో చోటు..!

హౌస్‌వైఫ్‌గా లేదా చిన్న జాబ్‌కి తప్ప నువ్వు దేనికి పనికిరావు అంటూ సంప్రీతి భట్టాచార్య(Sampreeti Bhattacharya) అనే యువతిని స్కూల్ డేస్‌లో టీచర్లు తిట్టిపోసేవారు.కట్ చేస్తే ఈ యువతి ఇప్పుడు ప్రపంచాన్ని మార్చే విధంగా గొప్ప పారిశ్రామికవేత్త అయ్యింది.

 You Will Get A Place In Forbes Because You Failed In Physics..!sampriti Bhattach-TeluguStop.com

స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో సంప్రీతిని ఆమె ఫిజిక్స్ టీచర్ ఎగతాళి చేసేవారు.ఎందుకంటే ఒకసారి ఆమె ఫిజిక్స్‌లో ఫెయిల్ అయింది.

దానివల్ల హౌస్‌వైఫ్‌గా ఇంట్లో అంట్లు తోముకో, బట్టలు ఉతుక్కో వంటి కామెంట్స్‌ను ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది.ఇప్పుడు, చాలా సంవత్సరాల తరువాత, ఆమె కోల్‌కతాకు చెందిన ఒక పారిశ్రామికవేత్తగా అవతరించింది.

ప్రస్తుతం సంప్రీతి వినూత్నమైన ఆలోచనలు చేస్తూ ఎగిరే పడవలను నిర్మిస్తోంది.నేవియర్ 30 అని పిలిచే ఎలక్ట్రిక్ హైడ్రోఫాయిల్ (Electric hydrofoil)బోట్‌తో సముద్రయానాన్ని పూర్తిగా మార్చడానికి కృషి చేస్తున్న నేవియర్ (Navier) సంస్థను ఆమె స్థాపించి దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తోంది.

రీసెంట్‌గా మీడియాతో మాట్లాడిన సంప్రీతి తాను విద్యార్థిగా ఫిజిక్స్‌ని ఇష్టపడ్డానని, తన ఫెయిల్యూర్ లేదా టీచర్ వ్యాఖ్యలు తనని ఆపలేదని తెలిపింది.హైస్కూల్ సమయంలో మాథ్స్‌లో కూడా తాను చాలా పూర్ అని సంప్రీతి వెల్లడించింది.

20 ఏళ్ల వయస్సులో సంప్రీతి 540 కంపెనీలలో ఇంటర్న్‌షిప్‌ల కోసం అప్లై చేస్తే యూఎస్‌లోని ఒక పార్టికల్ ఫిజిక్స్ లాబరేటరీ మాత్రమే అంగీకరించింది.అలా ఆమె ఫెర్మిలాబ్‌లో ఇంటర్న్‌షిప్ చేయగలిగింది.తర్వాత చికాగోకు రీసెర్చ్ అసిస్టెంట్‌గా వెళ్లి, అక్కడ సైన్స్‌పై ఇష్టాన్ని పెంచుకుంది.అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసాలో మరొక ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేసింది.ఒహియో స్టేట్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీని కంప్లీట్ చేసి మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి PhD పొందింది.తరువాత శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లి, $12 మిలియన్ల నిధులను సేకరించి, పడవను నిర్మించడానికి ఒక టీమ్‌ని సమీకరించింది.

2016లో ఫోర్బ్స్ ఆమెను ప్రపంచంలోని టాప్ 30 మోస్ట్ పవర్‌ఫుల్ యంగ్ చేంజ్ ఏజెంట్లలో ఒకరిగా గుర్తించింది.ఎందుకంటే ఆమె తన ఫీల్డ్‌లో ఒక మంచి మార్పును తీసుకురావడానికి లీడర్‌గా వ్యవహరించింది.అందుకే ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.

సంప్రీతి తయారు చేస్తున్న నేవియర్ 30 అనేది నీటి నుంచి పైకి లేవడానికి హైడ్రోఫాయిల్‌లను ఉపయోగించే పడవ.హైడ్రోఫాయిల్‌లు నీటి అడుగున రెక్కలు, ఇవి విమానం రెక్కల మాదిరిగానే పైగా ఎగురుతాయి.నేవియర్ 30 వేగంగా కదులుతున్నప్పుడు, హైడ్రోఫాయిల్‌లు పడవను నీటి నుంచి పైకి లేపుతాయి, డ్రాగ్‌ని తగ్గించి, పడవ వేగంగా, మరింత సమర్థవంతంగా ప్రయాణించేలా చేస్తాయి.

పడవ ఇకపై అలలపై ఎగరడం లేదు కాబట్టి ఇది స్మూత్, సైలెంట్ సెయిలింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది.నేవియర్ 30 ఇప్పటికీ అభివృద్ధిలో ఉంది, అయితే ఇది నీటిపై ప్రయాణించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Sampriti Bhattacharyya Success Story

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube