పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.ఇటీవల వచ్చిన యశోద మరియు శాకుంతలం సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.
దాంతో సమంత ముందు ముందు తెలుగు సినిమా ల్లో నటించేందుకు ఆసక్తి చూపించక పోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.కానీ తాజాగా విజయ్ దేవరకొండ తో( Vijay Devarakonda ) కలిసి నటించిన ఖుషి సినిమా( Khusi Movie ) భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో సమంత కి మళ్లీ టాలీవుడ్ లో భారీ ఆఫర్లు వరుసగా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇలాంటి సమయంలో సమంత వెంటనే కొత్త సినిమా లకు కమిట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ మద్య కాలంలో సమంత అనారోగ్య కారణాల వల్ల విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది.ఏడాది కాలం పాటు సమంత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.ఇప్పటికే దాదాపుగా ఆరు నెలలు అవ్వబోతుంది.
కనుక ఆ ఆరు నెలల సమయం పక్కన పెట్టి వెంటనే సమంత సినిమా లకు( Samantha Movies ) కమిట్ అయ్యి కొత్త సినిమాలకు సైన్ చేసి వచ్చే ఏడాది నుండి షూటింగ్ కు హాజరు అవ్వచ్చు కదా అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏడాదికి రెండు మూడు సినిమాలు సిరీస్ లు అయినా సమంత నుండి వస్తే చూడాలని కోరుకుంటున్నాం అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.ప్రస్తుతం మయో సైటిస్ వ్యాధి( Myositis ) కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమంత ముందు ముందు ఆ సమస్య మళ్లీ రాకుండా ఉండేందుకు గాను తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.అందులో భాగంగానే ఏడాది విశ్రాంతి తీసుకుంటుంది.
ఇక సమంత ఆరోగ్యం విషయంలో ఉన్న పుకార్లు అన్ని కూడా నిజం కాదు.ఆమె బాగానే ఉంది.
మరింత మెరుగ్గా ఆరోగ్యం మార్చుకునేందుకు గాను విశ్రాంతిలో ఉంది.







