ఆఫ్రికన్ యూనియన్‌ను( African Union ) జీ20లో పూర్తి సభ్యదేశంగా చేర్చాలని ప్రతిపాదించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి( Prime Minister Narendra Modi ) ప్రముఖ ఆఫ్రికన్ అమెరికన్ సింగర్, హాలీవుడ్ నటి మేరీ మిల్‌బెన్( Mary Millben ) ధన్యవాదాలు తెలిపారు.మోడీ ప్రతిపాదనకు అమెరికా మద్ధతు తెలిపింది.
గత వారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.భారతదేశానికి ఆఫ్రికా అత్యున్నత ప్రాధాన్యత అని తెలిపారు.ప్రపంచ వ్యవహారాల్లో తమ గొంతులు వినిపించడం లేదని భావించే వారిని చేర్చడానికి ఇది బాగా పనిచేస్తుందని మోడీ ఆకాంక్షించారు.20 అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల సమూహంలో ఆఫ్రికన్ యూనియన్‌ను పూర్తి సభ్యదేశంగా చేర్చడానికి భారతదేశం మద్ధతు ఇస్తుందని ప్రధాని తెలిపారు.
గత కొన్నేళ్లుగా భారత్.( Bharath ) గ్లోబల్ సౌత్, అభివృద్ధి చెందుతున్న, ముఖ్యంగా ఆఫ్రికా ఖండం ఆందోళనలు, సవాళ్లు, ఆకాంక్షలను వినిపిస్తూ ప్రముఖ వాయిస్‌గా తనను తాను నిలబెట్టుకుంది.దీనిపై మిల్‌బెన్ ఓ వీడియో విడుదల చేశారు.ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20లో( G20 Summit ) పూర్తి సభ్యదేశంగా చేర్చాలన్న ప్రధాని మోడీ ప్రతిపాదనను తాను అభినందిస్తున్నానని చెప్పారు.
గ్లోబల్ సౌత్ ఇప్పుడు మన ప్రపంచాన్ని ప్రభావితం చేసే విధానాలను రూపొందించగలదన్నారు.

ఎవరీ మిల్‌బెన్ :
ఓక్లహోమా నగరంలోని( Oklahoma ) క్రైస్తవ కుటుంబంలో ఆమె జన్మించారు.తల్లి అల్ధియా మిల్‌బెన్ పెంటెకోస్తల్ మ్యూజిక్ పాస్టర్‌గా పనిచేసింది.ఈ క్రమంలోనే మ్యూజిక్ మిల్‌బెన్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది.
ఈ నేపథ్యంలో ఓక్లహోమా సిటీలోని వైల్డ్‌వుడ్ క్రిస్టియన్ చర్చిలో చిన్నారుల గాయక బృందంలో ఐదేళ్ల వయసులోనే పాడటం ప్రారంభించింది.భారత ప్రభుత్వం, కేంద్ర విదేశాంగ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఆహ్వానం మేరకు మిల్‌బెన్( Millben ) గతేడాది భారతదేశాన్ని సందర్శించారు.
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మిల్‌బెన్ ప్రదర్శన ఇచ్చారు.

మిల్‌బెన్ గతంలో భారత జాతీయ గీతం జనగణమన,( Janaganamana ) ఓం జై జగదీష హరే( Om Jai Jagadish Hare Song ) పాటలను పాడి భారతీయులకు దగ్గరయ్యారు.ఆమెకు తొలి నుంచి భారతదేశమన్నా, ఇక్కడి సాంప్రదాయాలన్నా ఎంతో ఇష్టం.ఈ ఏడాది జూన్ 23న వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ (యూఎస్‌ఐసీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖుల సమక్షంలో ప్రదర్శన ఇచ్చారు.
ఈ సందర్భంగా మోడీ పాదాలకు మిల్‌బెన్ నమస్కరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.