పుష్ప సినిమా( Pushpa movie ) లో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను తాజాగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా లో నటిస్తున్నాడు.కొన్ని నెలల క్రితం అల్లు అర్జున్ బాలీవుడ్ సెన్షేషనల్ మూవీ ‘జవాన్’ ( Jawan )లో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది.
షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వం లో రూపొందిన జవాన్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమా విడుదల తర్వాత అల్లు అర్జున్ అభిమానులు ఉసూరుమంటున్నారు.
అల్లు అర్జున్ ఉంటాడు అంటూ చాలా బలంగా నమ్మాం.కానీ ఇలా జరిగింది ఏంటి అంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ( Allu Arjun )ను జవాన్ లో చూడబోతున్నాం అంటూ ఫ్యాన్స్ తెగ మాట్లాడుకున్నారు.
కానీ అట్లీ ( Atlee )తాజాగా క్లారిటీ ఇచ్చాడు.ఈ సినిమా లో ఎలాంటి సర్ ప్రైజ్ లు లేవు, ఎలాంటి గెస్ట్ అప్పియరెన్స్ లు లేవు అని.అన్నట్లుగానే సినిమా లో ఎలాంటి గెస్ట్ పాత్ర లేదు అని చూసిన వారు అంటున్నారు.షారుఖ్ ఖాన్ మూవీ లో అల్లు అర్జున్ చిన్న పాత్ర లో అయినా ఉండి ఉంటే అసలైన పాన్ ఇండియా మూవీ గా జవాన్ నిలిచేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జవాన్ సినిమా లో అల్లు అర్జున్ ను చూపించాలి అనుకున్న మాట వాస్తవమే కానీ, అట్లీ చివరి నిమిషం లో కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం జరిగింది.
అల్లు అర్జున్ కంటే ముందు అదే గెస్ట్ రోల్ కోసం దర్శకుడు అట్లీ పలువురు స్టార్ హీరోలను సంప్రదించడం జరిగిందట.కానీ కొన్ని కారణాల వల్ల ఏ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు.
బన్నీ ఓకే చెప్పినా కూడా చివరకు అట్లీ నే స్వయంగా తన నిర్ణయం మార్చుకుని గెస్ట్ పాత్ర ను లేపేసినట్లుగా తెలుస్తోంది.