తిరుపతి: టిటిడి ఇఓ ధర్మారెడ్డి కామెంట్స్.కర్రల కొనుగోలుకు లక్ష రూపాయలు ఖర్చు చేయలేదు.
టీటీడీపై పనిగట్టుకుని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు.భక్తుల భద్రత నిమిత్తమే కర్రలను కొనుగోలు చేశాం.
శేషాచలం అటవీ ప్రాంతంలోని చెట్లతో కర్రలను తయారు చేయలేదు.ఇప్పటివరకు పదివేల కర్రలను 45 వేలకు మాత్రమే కొనుగోలు చేశాం.
వన్యప్రాణుల నుంచి రక్షణ కొరకు చేతి కర్రలు అందిస్తున్నాము.వందమంది గుంపులు గుంపులుగా పంపే చర్యలు చేపట్టాము.12 సంవత్సరాలలోపు చిన్నపిల్లలు ఉన్న భక్తులను మధ్యాహ్నం రెండు గంటల వరకు అనుమతిస్తున్నాము.ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అలిపిరి మార్గంలో భక్తులు నడిచి వెళ్ళవచ్చు.
శేషాచలం వృక్ష సంపదను కాపాడుతున్నాం.