ముఖ్యంగా చెప్పాలంటే ఆడవారికి పీరియడ్స్( Menstruation ) రావడం అనేది సహజసిద్ధంగా జరుగుతూ ఉంటుంది.అయితే మన సంప్రదాయంలో పీరియడ్స్ లో ఉన్న సమయాన్ని చాలామంది అపవిత్రంగా ప్రజలు భావిస్తారు.
నెలసరి సమయంలో ఎలాంటి మంచి పనులలో కూడా పాల్గొన కుండా ఉంటారు.పూర్వం సమయంలో దాదాపు అన్ని పనులు ఆడవారే చేసేవారు కాబట్టి పీరియడ్స్ సమయంలో వారికి రెస్ట్ ఇవ్వకపోతే వారి ఆరోగ్యం చెడిపోతుందని అలా చేసేవారు.
పీరియడ్స్ సమయంలో ఎక్కువగా నీరసంగా ఉంటుంది.అలాగే ఉత్సాహంగా ఉండలేరు.
కొంతమందిలో తీవ్రమైన నొప్పి కూడా ఉంటుంది.
అందుకే ఏ పని చేయనివ్వరు.రాను రాను అది ఆచారంగా మారిపోయింది.రుతుస్రావం జరుగుతున్నప్పుడు పూజా కార్యక్రమాలు, వివాహాలు, శుభకార్యాలకు హాజరు కాకూడదని చాలామంది ప్రజలు నమ్ముతారు.
అందుకే ఏదైనా శుభకార్యం ఉంటే చాలు ఇంట్లో మహిళలు( Women Menses ) తమ పీరియడ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు.ఇక దానిని వాయిదా వేయడానికి కొన్ని రకాల టాబ్లెట్లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
వాటి ద్వారా నెలసరిని తమ పని అయ్యేంతవరకు వాయిదా వేయాలని అనుకుంటుంటారు.అయితే ఇలా తరచూ చేయడం వల్ల చాలా నష్టపోవాల్సి వస్తుంది.
ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
సాధారణంగా మనం నెలసరిని వాయిదా( Period Delay ) వేయడానికి షుగర్ పిల్స్, ప్రోజెస్టిన్ మందులను ఉపయోగిస్తూ ఉంటాము.ఇంకా చెప్పాలంటే వీటిని వాడడం వల్ల హార్మొనల్ ఇమ్ బాలెన్స్( Hormonal Imbalance ) జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.అలాగే మన నిద్ర, సెక్స్ సామర్థ్యం, మన ఆలోచనలు అన్నీ నెలసరి పై ఆధారపడి ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
వీటి కారణంగా వికారం, తలనొప్పి, రొమ్ము సున్నితత్వం, నమూనాలలో మార్పులు వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి.అలాగే తర్వాత రోజులలో పిరియడ్స్ క్రమ రహితంగా మారే అవకాశం ఉంటుంది.
అందుకే పుణ్యకార్యాలు, పూజలు, పునస్కారాలు, వివాహాలు అంటూ నెలసరిని వాయిదా వేయడానికి ఇలాంటి ఔషధాలను అసలు ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు.