తెలుగు బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ సెవెన్ కార్యక్రమం ఆదివారం ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమై మొదటి వారం నామినేషన్స్ కూడా నిర్వహించారు.
ఇక ఇందులో భాగంగా ఎవరికి వారు వారి ఆట తీరును కనబరిస్తూ రచ్చ చేస్తున్నారు.ఇక ఈ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో కార్తీకదీపం(Karthika Deepam) మోనిత(Monitha) కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈమె ఈ కార్యక్రమంలో శోభ శెట్టి(Sobhashetty )లా కాకుండా సీరియల్ లో మోనిత పాత్రలోనే లీనమవుతూ బిగ్ బాస్ లో కూడా రెచ్చిపోతున్నారని చెప్పాలి.

ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జరిగినటువంటి నామినేషన్స్ లో ప్రతి ఒక్కరు కూడా ఇతరులను నామినేట్ చేస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు.అయితే గౌతమ్ కృష్ణ(Gautham Krishna)అనే డాక్టర్ ను నామినేట్ చేశారు.ఆయనని నామినేట్ చేయడానికి గల కారణం తెలుపుతూ ఈమె ఒక సిల్లీ రీసన్ తెలిపారు.
గౌతమ్ కృష్ణతో తనకు మంచి బాండింగ్ ఏర్పడటం లేదని ఆయనతో మాట్లాడాలని ప్రయత్నాలు చేసిన ఆయన మాత్రం మాట్లాడటం లేదు తనని అవాయిడ్ చేస్తున్నారన్న ఉద్దేశంతోనే తనని నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు.

ఇక ఈమె చెప్పిన రీజన్ విన్నటువంటి నెటిజన్స్ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.నామినేట్ చేయడానికి ఇది కూడా ఒక రీజనేనా అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇక హౌస్లో కూడా డాక్టర్ బాబు తనతో మాట్లాడటం లేదు అంటూ తనని నామినేట్ ( Nominate ) చేయడంతో ఈ విషయంపై కొందరు నెటిజెన్స్ స్పందిస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా డాక్టర్ బాబును( Doctor Babu ) ఈ మోనిత వదలడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అక్కడైనా శోభ శెట్టి లాగా ఆట ఆడమని మోనిత మాదిరిగా బిహేవ్ చేయొద్దు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఏది ఏమైనా కార్తీకదీపం సీరియల్ లో విలన్ గా అందరినీ భయభ్రాంతులకు గురిచేసినటువంటి ఈమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్గా అడుగుపెట్టినప్పటికీ కూడా అలాగే విలన్ క్యారెక్టర్ లోనే లీనం అయిపోయి కంటెస్టెంట్ అందరితోనూ గొడవకు ఒక దిగుతూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.ఇలా ఈమె తన ఆట తీరును మార్చుకోకుండా ఉంటే ఎక్కువ కాలం పాటు హౌస్ లో కొనసాగదు అంటూ కూడా ఈమె పట్ల పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేయడం గమనార్హం.చూడాలి మరి మోనిత తన ఆటతీరుతో ఎన్ని రోజులు హౌస్ లో ఉంటూ ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి.







