సోషల్ మీడియా( Social media )లో ఎక్కువగా కుక్కలకు, పిల్లులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి.ఎందుకంటే అవి చేసే అల్లరి చిల్లరి పనులు జనాలకి చాలా నవ్వుని తెప్పిస్తూ వుంటాయి.
ఇక్కడ కూడా ఓ కుక్క అచ్చం మనిషి లాగానే స్కేటింగ్ బోర్డుపై ఎక్కి స్కేటింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మనం చూడవచ్చు.ఈ వీడియోను ఎక్స్( ట్విటర్) పేజీలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది కాస్త వైరల్ అవుతోంది.
కాగా ఈ వీడియో చూస్తున్న వారు ఆ కుక్క చేస్తున్న పనులు చూసి వావ్ అంటున్నారు.ఇక మధ్యలో కుక్క( Dog )కు టాయిలెంట్ రావడంతో అది ఆగి రోడ్డు పక్కన పద్దతిగా టాయిలెట్ పోసి వెళ్ళడం మనం ఈ దృశ్యంలో చూడవచ్చు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నెటిజనం రకరకలుగా స్పందిస్తున్నారు.విషయంలోకి వెళితే, వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కుక్క స్కేటింగ్ చేస్తూ ఉంటుంది.ఈ క్రమంలో దానికి మధ్యలో దానికి టాయిలెట్ వస్తుంది.అది వెంటనే స్కేటింగ్ బోర్డు నుంచి దిగి రోడ్డు దగ్గర ఓ మూలకు వెళ్లి టాయిలెట్ పోస్తుంది.
మళ్లీ వచ్చి స్కేటింగ్( Skating ) బోర్డుపై ఎక్కి స్పీడుగా వెళ్లిపోతుంది.అది స్కేటింగ్ బోర్డు ఎక్కేటప్పుడు అచ్చం మనిషి లాగానే మొదటి దాని ముందర కళ్లు పెట్టి కొద్దిగా ముందుకు నెట్టి తరువాత దాని పైకి ఎక్కడం మనం విశేషం.

ఇక అది అలా వెళుతున్నప్పుడు మధ్యలో స్పీడ్ బ్రేకర్ కూడా వస్తుంది.అయినా ఆ కుక్క బెదరకుండా చక్కగా వెళ్లిపోతుంది.స్కేటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు జాగ్రత్తగా ఉండే విషయం కూడా బాగా తెలిసినట్టు ఉంది.అది స్కేటింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద వాటర్ ఉంటాయి.అది వెంటనే స్కేటింగ్ బోర్డు దిగి నెమ్మదిగా దానిని ముందు తోసి మళ్లీ దాని మీద ఎక్కడం మనం ఇక్కడ చూడవచ్చు.దీనికి సంబంధించిన వీడియోను ఇప్పటికే 7 మిలియన్ల మందికి పైగా చూడడం విశేషం.







