సెల్ఫీల పిచ్చి చాలామంది ప్రాణాలను బలి తీసుకుంటుంది.సెల్ఫీల మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకోవద్దని యువతకు ఎంత చెప్పినా వారు వినకుండా అలానే రిస్క్ చేస్తున్నారు.
చివరికి కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నారు.తాజాగా కేదార్‌నాథ్‌కు( Kedarnath ) వెళుతున్న ఓ యాత్రికుడు సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించి ఉధృతంగా ప్రవహిస్తున్న మందాకిని నదిలోకి జారి పడిపోయాడు.
అదృష్టం కొద్దీ అతని స్నేహితులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి వెంటనే స్పందించారు.అతను చాలా నిమిషాల పాటు బండరాయిని పట్టుకోగా స్థానికులు చాలా చాకచక్యంగా అతడిని రక్షించారు.

ఈ సంఘటన రంబాడ సమీపంలో ట్రెక్కింగ్ మార్గంలో జరిగింది, ఇక్కడ నది భారీ వర్షాల కారణంగా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.గుర్తు తెలియని యాత్రికుడు( traveler ) నదిపై ఉన్న వంతెనపై సెల్ఫీ తీసుకుంటుండగా బ్యాలెన్స్ తప్పి కిందపడ్డాడు.అతని స్నేహితులు, స్థానికులు అతన్ని రక్షించడానికి వెంటనే నదిలోకి దిగారు.వారు బండరాళ్లపైన నడుచుకుంటూ వెళ్లి సదరు యువకుడికి తాడు అందించారు.అనంతరం చాలా జాగ్రత్తగా అతడిని బయటికి తీసుకొచ్చారు.

ఈ సమయంలో నీరు చాలా వేగంగా ప్రవహిస్తుండగా యాత్రికుడు ఒక బండరాయిని బలంగా పట్టుకున్నాడు, ఇంకాస్త ఆలస్యమైతే అతడు ఆ బండరాయిని విడిచి పెట్టేలా కనిపించాడు.కానీ ఈ భూమ్మీద బతికే నూకలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రమాదం జరగకముందుకే స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయటపడగలిగాడు.సదరు యాత్రికుడు గుజరాత్‌కు చెందిన 35 ఏళ్ల వ్యక్తి అని తెలిసింది.అతను స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి కేదార్‌నాథ్ యాత్ర చేస్తున్నాడు.2023, సోమవారం, సెప్టెంబర్ 5న ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో యాత్రికుడు గాయపడలేదు.







