ఈడీ నోటీసుల వ్యవహారంపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులపై ఇంకా ఎటువంటి సమాచారం లేదని చెప్పారు.
ఈ క్రమంలో నోటీసులు అందితే వివరణ ఇస్తామని మంత్రి గంగుల తెలిపారు.ఈడీ అధికారులు ఏ డాక్యుమెంట్ అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
శ్వేతా గ్రానైట్స్ ఏజెన్సీ వందశాతం పారదర్శకంగా ఉందన్న మంత్రి గంగుల ఫెమా నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించలేదని వెల్లడించారు.ఆర్బీఐ నిబంధనలను తూచా తప్పకుండా పాటించామన్నారు.
గతంలోనూ ఈడీ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చామని ఆయన తెలిపారు.ఈ క్రమంలోనే నోటీసులు సాధారణ ప్రక్రియ అన్న గంగుల చట్టాన్ని గౌరవిస్తామని వెల్లడించారు.







