అసౌకర్యాల నడుమ ఆదర్శ పాఠశాల...!

నల్లగొండ జిల్లా:కేతేపల్లి మండల( Kethepalli ) పరిధిలో 16 గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉంటుందని జాతీయ రహదారిపై ఉన్న కొర్లపహడ్ గ్రామ పరిధిలో ప్రభుత్వ ఆదర్శ పాఠశాల( Govt School )ను ఏర్పాటు చేశారు.ఈపాఠశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో సుమారు 400 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

 An Ideal School Amidst Inconveniences , Korlapahad , Govt School , Kethepalli-TeluguStop.com

కొందరు వసతి గృహాల్లో ఉండగా,మరి కొందరు ఇంటి నుండి డే స్కాలర్స్ వస్తుంటారు.కానీ,పేరులో ఉన్న ఆదర్శం ఈ పాఠశాలలో మరియు వసతి గృహాలలో ఎక్కడా టార్చ్ వేసిన వెతికినా కనిపించదు.

ఊరికి దూరంగా ఉండడంతో…!కొర్లపహాడ్( Korlapahad ) ఆదర్శ పాఠశాల గ్రామానికి దూరంగా అటవీ ప్రాంతంలో ఉండడంతో దీనిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

పాఠశాల,వసతి గృహాలలో సరైన వసతులు లేవు.

అసలే వర్షా కాలం కావడంతో పాఠశాల ఆవరణం మొత్తం బురద మాయమై,గడ్డి ఏపుగా పెరిగి దోమలు, విషసర్పాలకు నెలవుగా మారి,పారిశుద్ధ్యం కూడా పడకేయడంతో విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు.కేజిబిఎస్ ఎస్ఓలకు నిర్వహణ బాధ్యతలు ఆదర్శ పాఠశాల వసతి గృహాల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం కేజిబిఎస్ పాఠశాల ఎస్ఓలకు అప్పగించింది.

ప్రతి రోజూ వసతి గృహాల పర్యవేక్షణ చేయాల్సిన ఎస్ఓ అప్పుడప్పుడు వస్తూ నామమాత్రపు విజిటింగ్ చేయడంతో పాఠశాల మరియు వసతి గృహాలలో భోజన సదుపాయం, త్రాగునీరు,మరుగుదోడ్లు, దోమల బెడద మొదలగు సమస్యలతో విద్యార్థులు అసౌకర్యాల నడుమ అవస్థలు పడుతున్నారు.

పాఠశాల ఆవరణంలో గంజాయి వాసన…!ముఖ్యంగా బాలికల వసతి గృహం పరిసరాల్లో ఆకతాయిలు గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలు సేవిస్తూ బాలికలను ఈవిటిజింగ్ కుపాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపస్తున్నాయి.

బాలికల వసతి గృహం మ్యాట్రిన్ (వార్డెన్)గా విధులు నిర్వహిస్తున్నది వికలాంగ మహిళా ఉద్యోగి కావడంతో ఆకతాయిలు పెచ్చిమీరిపోతున్నరని తెలుస్తోంది.డే స్కాలర్స్ ప్రయాణం ప్రమాదకరం.!ఆదర్శ పాఠశాలలో డే స్కాలర్స్ వచ్చిపోయే విద్యార్థులకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆటోలలో ప్రయాణం చేసే విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పాలి.ఒక్కో ఆటోలో 20 నుండి 30 మందిని వెనుక కూడా నిల్చో బెట్టి,వారికి తోడు స్కూల్ బ్యాగ్స్ ను కూడా కుక్కి ప్రమాదకర ప్రయాణం చేపిస్తున్నారు.

ఏదైనా జరగరానిది జరిగితే విద్యార్థులు పెను ప్రమాదంలో పడే అవకాశం ఉంది.అయినా ఇవేవీ ఆర్టీఏ అధికారులకు కనిపించక పోవడం విచిత్రంగా ఉంది.కొర్ల పహాడ్ ఆదర్శ పాఠశాల సమస్యలకు నిలయంగా మారిందని ఎన్ఎస్ యుఐ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి అల్లి అంజన్ కుమార్ యాదవ్( Anjan Kumar yadav ) అన్నారు.ఆదర్శ పాఠశాల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది.

అనేక సమస్యలతో సతమతమవుతున్నారు.సమస్యలపై అడగడానికి వెళితే ప్రిన్సిపాల్ అనుమతి లేదని అంటున్నారు.

పేద విద్యార్దులకు విద్యను దూరం చేసేందుకే ప్రభుత్వం కుట్ర చేస్తుంది.ఇక్కడ పరిస్థితిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube