తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.గద్వాల నుంచి ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నిక అయినట్లుగా ప్రచురించాలని తెలంగాణ సీఈవోకు ఈసీ అండర్ సెక్రెటరీ సంజయ్ కుమార్ లేఖ రాశారు.
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తదుపరి గెజిట్ లో ప్రచురించాలని లేఖలో పేర్కొన్నారని తెలుస్తోంది.ఈ మేరకు సీఈవో వికాస్ రాజ్ కు రాసిన లేఖకు హైకోర్టు తీర్పు కాపీని కేంద్ర ఎన్నికల సంఘం జతపరిచింది.
అయితే ఇటీవలే గద్వాల ఎమ్మెల్యేగా ఉన్న బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసిన న్యాయస్థానం డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.







