కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణ రాజకీయాల్లో వీరి మానియా తెలియని ప్రజలు ఉండరు.నల్గొండ( NOLGONDA ) రాజకీయాల్లో వీళ్లు సంచలనం సృష్టించే రాజకీయవేత్తలు.
అలాంటి కోమటిరెడ్డి బ్రదర్స్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy ) కూడా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండేవారు.
కానీ గత కొన్ని నెలల క్రిందట ఆయన బిజెపిలో చేరి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.ఆ తర్వాత మునుగోడులో( MUNUGODU ) ఉప ఎన్నికలు వచ్చాయి.
ఈయన బిజెపి తరఫున పోటీ వేసి ఓడిపోయారు.అలాంటి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఈ మధ్యకాలంలో వార్తలు వినిపిస్తున్నాయి.
అది నిజమేనా.ఆ విశేషాలు చూద్దాం.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009లో ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.అప్పటినుంచి అలుపెరుగని నేతగా కాంగ్రెస్ లో కొనసాగుతూ వచ్చారు.అలా 2018 శాసనసభ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ పై గెలిచి ఆ తర్వాత బిజెపిలో (BJP) చేరి మళ్ళీ బిజెపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు.ఇక అప్పటినుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి పార్టీలో అంతా యాక్టివ్ గా ఉండడం లేదు.
నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలకు కూడా వెళ్లడం లేదట.దీనికి ప్రధాన కారణం తెలంగాణలో బిజెపికి అంతగా ఆదరణ లేదని ఆయనకు అర్ధమైనట్టుంది.
కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్( CONGRESS ) పుంజుకుంటుంది.బిజెపి మరింత బలహీనపడుతోంది.
ఇదే తరుణంలో ఆయన బిజెపిలో చేరి తప్పు చేశానే అని ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఆయన మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో చేరుతారు అనే వార్తల అనేకం వినిపిస్తున్న కానీ, ఏ విధంగా కూడా స్పందించడం లేదు.దీన్ని బట్టి చూస్తే ఆయన మనసు నిండా కాంగ్రెస్ పార్టీ ఉందని అర్థమవుతుంది.
మరి చూడాలి ఎలక్షన్స్ వరకు ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా.? లేదంటే బీజేపీ లోనే కొనసాగుతూ ఉంటారా.? అనేది ముందు ముందు తెలుస్తుంది.