రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రికత్త నెలకొంది.కళాశాలలో కోర్సులకు యూనివర్సిటీ రూ.
లక్షలు వసూలు చేసి ఇప్పుడు ప్రభుత్వం అనుమతి లేదని యాజమాన్యం చేతులెత్తేసిందని తెలుస్తోంది.ఈ క్రమంలో గురునానక్ కాలేజ్ ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసనకు దిగారు.
దీంతో యూనివర్సిటీ ప్రాంగణంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు సరైన న్యాయం చేయాలని బాధిత విద్యార్థులు కోరుతున్నారు.
లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెబుతుున్నట్లు సమాచారం.







