కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రెడీ ! వీరికి టికెట్ కన్ఫర్మ్ ?  

తెలంగాణ కాంగ్రెస్( Congress ) దూకుడు మీద ఉంది.తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది.

 The List Of Congress Candidates Is Ready! Is The Ticket Confirmed For Them, Tela-TeluguStop.com

ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ ఆ లిస్ట్ ను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమైంది.ఈరోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా హడావుడి జరుగుతుంది.

ఈ మేరకు ఆశావాహుల అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ పొలిటికల్ యాక్షన్ కమిటీ పరిశీలించింది.

Telugu Aicc, Congressmla, Revanth Reddy, Telangana-Politics

నియోజకవర్గల వారీగా ఫైనల్ చేసిన అభ్యర్థుల జబితాను  టిపిసిసి స్టీల్ కవర్( TPCC steel cover ) లో స్క్రీనింగ్ కమిటీకి అందజేయనుంది.26 నియోజకవర్గాల్లో ఒకే అభ్యర్థిని ఎంపిక చేసినట్లు సమాచారం.కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు, మరికొన్ని నియోజకవర్గాల్లో ముగ్గురు చొప్పున పేర్లను ఈ జాబితాలో సిఫార్సు చేసినట్లు సమాచారం.

ముఖ్య నేతలందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఎన్ని స్థానాలకు ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలనే దానిపైన ఫైనల్ గా నిర్ణయం తీసుకోనున్నారు.

Telugu Aicc, Congressmla, Revanth Reddy, Telangana-Politics

ఇక కొంతమంది అభ్యర్థుల పేర్లు ఫైనల్ చేసినట్లు సమాచారం.ఆ వివరాలు ఒకసారి పరిశీలిస్తే… కొడంగల్ రేవంత్ రెడ్డి( Kodangal Revanth Reddy ), మధిర భట్టి విక్రమార్క , హుజూర్ నగర్ ఉత్తంకుమార్ రెడ్డి , నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి , జగిత్యాల జీవన్ రెడ్డి , మంథని శ్రీధర్ బాబు , సంగారెడ్డి జగ్గారెడ్డి , ములుగు సీతక్క,  భద్రాచలం సోదెం వీరయ్య,  ఆందోల్ దామోదర రాజనర్సింహ,  మంచిర్యాల ప్రేమ సాగర్ రావు , పరిగి రామ్మోహన్ రెడ్డి , ఇబ్రహీంపట్నం మల్ రెడ్డి రంగారెడ్డి , కోదాడ పద్మావతి రెడ్డి , వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్,  జహీరాబాద్ ఏ చంద్రశేఖర్, బోధన్ సుదర్శన్ రెడ్డి , నాంపల్లి ఫిరోజ్ ఖాన్ , భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ , వరంగల్ ఈస్ట్ కొండ సురేఖ,  నర్సంపేట దొంతి మాధవరెడ్డి,  హుజూరాబాద్ బల్మురు వెంకట్,  వేములవాడ ఆది శ్రీనివాస్ పేర్లు ఖరారు అయినట్లు సమాచారం.జడ్చర్ల అనిరుద్ రెడ్డి , మక్తల్ ఎర్ర శేఖర్ , నిర్మల్ కూచాడి శ్రీహరిరావు,  చొప్పదండి మేడిపల్లి సత్యం , నాగార్జునసాగర్ జానారెడ్డి కుమారుడు పేర్లు ఖాయమైనట్లు సమాచారం.

ఇక కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో వెర్టిపైనా కాస్త ఆలస్యంగా నిర్ణయం తీసుకోబోతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube