ఎన్నికలకు దగ్గరకు వస్తున్న కొద్ది గెలుపు గుర్రాల కోసం పార్టీల అన్వేషణ తీవ్ర స్థాయిలో జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.ముఖ్యంగా ఒక నియోజకవర్గ మొత్తాన్ని తమ ఆర్థిక, సామాజిక బలంతో మలుపు తిప్పగల అభ్యర్థుల కోసం పార్టీలు చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటికే మూడొంతుల బలాన్ని పెంచుకున్న కాంగ్రెస్ తుమ్మల నాగేశ్వరరావును( Tummala Nageswara Rao ) గనుక పార్టీలోకి చేర్చుకుంటే నూటికి నూరు శాతం ఆ జిల్లాపై పట్టు సాదించినట్టే అన్న ఆలోచనతో ఇప్పుడు కాంగ్రెస్ ( Congress )కీలక నాయకులందరూ తుమ్మల జపం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ఇప్పటికే టి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ,ఉత్తమ్ కుమార్ రెడ్డి,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తుమ్మలతో భేటీ అయి చర్చలు జరిపారు.ఇప్పుడు ఖమ్మం జిల్లా కీలక నాయకుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి( Pongileti Srinivasa Reddy ) కూడా తుమ్మలతో భేటీ అయినట్లుగా తెలుస్తుంది.తెలంగాణ కు అన్యాయం చేస్తున్న బారాస పార్టీపై ఉమ్మడిగా పోటీ చేయడానికి తుమ్మలను ఆహ్వానించానని ఆయన తన అనుచరులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారని , ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తామంటూ పొంగులేటి మీడియాతో చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఫిక్స్డ్ ఓటు బ్యాంకు ను పెంచుకున్న బారాసాని ఓడించాలంటే స్థానికంగా బలంగా ఉన్న కీలక నేతలను ఆకట్టుకోవటమే మార్గమని భావిస్తున్న కాంగ్రెస్ ఎక్కడి కక్కడ గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తుంది.ఏమాత్రం అవకాశమున్నా అలాంటి నేతలను చేర్చుకోడానికి ఎంత దూరమైనా వెళ్తుంది, రాజకీయ భవిష్యత్తు మీద భరోసా ఇస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తుంది.తుమ్మల కూడా కాంగ్రెస్ లోకి చేరడానికి అంగీకారంగానే ఉన్నప్పటికీ తెలంగాణలో మరొకసారి బారాసా అధికారంలోకి వస్తుందన్న అంచనాలు భారీగా ఉండడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తుంది.అయితే అవమానించిన పార్టీలో ఉండటం కన్నా కాంగ్రెస్లోకి చేరటమే మంచిదన్న అనుచరులు సూచనతో తొందర్లోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొ నున్నట్టు తెలుస్తుంది.
తుమ్మలచెరిక కానీ జరిగితే పూర్తిస్థాయిలో ఒక జిల్లాపై కాంగ్రెస్కు పట్టు వచ్చినట్లు అవుతుంది .రానున్న రెండు నెలల కాలంలో పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ హామీల అస్త్రాన్ని ప్రయోగించబోతున్నట్లుగా తెలుస్తుంది.మరి అధికారపక్షం కాంగ్రెస్ ప్రయత్నాలు ఏ విధంగా తిప్పి కొడుతుందో చూడాలి
.






