తెలుగు బిగ్ బాస్ సీజన్ 7( Telugu Bigg Boss Season 7 ) ప్రారంభం అయింది.ఇప్పటికే చాలా మంది పేర్లు ప్రచారం జరిగాయి.
ఈటీవీ ప్రభాకర్ తో పాటు ఇంకా చాలా మంది ప్రముఖుల పేర్లు వినిపించాయి.కానీ వారి లో చాలా మంది బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టలేదు.
బిగ్ బాస్ ప్రారంభం ఎపిసోడ్ భారీ ఎత్తున జరిగింది.కానీ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ మాత్రం నిరాశ పరిచారు.
ఇద్దరు ముగ్గురు మినహా ఎవరు కూడా ఆసక్తిగా కనిపించడం లేదు.శివాజీ( Shivaji ) మరియు షకీలా లు తప్ప బాగా తెలిసిన వారు ఎవరు లేక పోవడం తో అంతా కూడా షాక్ అవుతున్నారు.

బిగ్ బాస్ సీజన్ 7 విషయం లో మొదటి నుండి హైప్ క్రియేట్ చేశారు.ఉల్టా ఫల్టా.కుడి ఎడమైతే అన్నట్లుగా ప్రచారం చేశారు.తీరా కంటెస్టెంట్స్ విషయం లో ఇలా నిరాశ పరిచారు ఏంటి అంటూ సోషల్ మీడియా( Social media ) లో ట్రోల్స్ వస్తున్నాయి.
బిగ్ బాస్ గురించి కచ్చితంగా ట్రోల్స్ వస్తాయి.అయితే ఈసారి బిగ్ బాస్ మొదలు అయిన రోజే ట్రోల్స్ రావడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా బిగ్ బాస్ ఇక నుండి అయినా ఉంటుందా అనేది చూడాలి.బిగ్ బాస్ సీజన్ 7 లో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని కంటెంట్ ను చూడబోతున్నట్లుగా చెబుతున్నారు.
అది ఎంత వరకు కరెక్ట్ అనేది చూడాలి.హీరో లు హీరోయిన్స్ ఎవరు లేక పోవడం వల్ల షో పై కొందరికి ఆసక్తి లేదు.

కొందరు మాత్రం పర్వాలేదు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.ఆకట్టుకునే విధంగా బిగ్ బాస్ ఎడిటింగ్ ఉంటే తప్పకుండా షో కి మంచి రేటింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.బిగ్ బాస్ షో లో ఉన్న కంటెంస్టెంట్స్ తో సంబంధం లేకుండా కంటెంట్ పై ఆధార పడి సక్సెస్ అవుతుందని కొందరు అంటున్నారు.కంటెస్టెంట్స్ ను ఎవర్రా మీరంతా అంటూ తిట్టిన వారే వారికి ఆర్మీ అంటూ ఏర్పడి కచ్చితంగా సక్సెస్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.