తెలుగు రాష్ట్రాల్లో 'జవాన్' జోరు.. షారుఖ్ బిగ్గెస్ట్ రికార్డ్ పక్కానా?

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”జవాన్”( Jawan ). ఈ సినిమా కోసం అటు బాలీవుడ్ ప్రేక్షకులు ఇటు కోలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాదు కోలీవుడ్ కు చెందిన స్టార్స్ కూడా చాలా మంది ఉన్నారు.దీంతో ఈ రెండు ఇండస్ట్రీలలో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.

Telugu Atlee Kumar, Jawan, Jawan Telugu, Nayanthara, Shahrukh Khan, Shahrukhkhan

షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార ( Nayanatara )హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ( Director Atlee ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ”జవాన్”.ఈ సినిమా హిందీలో మాత్రమే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది.షారుఖ్ ‘పఠాన్’ సినిమా హిట్ తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) ఫుల్ జోష్ తో జవాన్ సినిమాను పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధంగా ఉంచాడు.

అందుకే ఈయన ఫ్యాన్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్( Jawan Release ) కాబోతుంది.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా హిందీ, తమిళ్ భాషల్లో భారీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యి రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి.

మరి ఈ సినిమా తెలుగులో కూడా హిందీ వర్షన్ కు భారీ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నట్టు టాక్.

Telugu Atlee Kumar, Jawan, Jawan Telugu, Nayanthara, Shahrukh Khan, Shahrukhkhan

ఇప్పటికే వచ్చిన ట్రైలర్ తో తెలుగులో కూడా భారీ హైప్ రావడంతో నైజాం ఏరియాలో 50 శాతం ఆక్యుపెన్సీతో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్టు ఇప్పటికే 70 లక్షల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చినట్టు చెబుతున్నారు.దీంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా షారుఖ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టడం ఖాయం అంటున్నారు.ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే మంచి ఓపెనింగ్స్ ఖాయం అంటున్నారు.

చూడాలి ఏం జరుగుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube