సినిమా ఇండస్ట్రీలో అయినా మరే రంగంలో అయినా సక్సెస్ సాధించాలంటే టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి.జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కు టాలెంట్ తో పాటు అదృష్టం తోడై చిన్న వయస్సులోనే స్టార్ హీరో స్టేటస్ వచ్చింది.
మధ్యలో కొన్నేళ్ల పాటు ఫ్లాపులు ఎదురైనా తారక్ మాత్రం మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు.గత కొన్నేళ్లుగా తారక్ కు కెరీర్ పరంగా తిరుగులేదు.

ప్రముఖ జ్యోతిష్కులు తారక్ జాతకాన్ని( Junior NTR Jathakam ) పరిశీలించి సరైన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే సీఎం కాదు పీఎం అయ్యే యోగం కూడా ఉందని చెబుతున్నారు.రాజకీయాల్లోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవని వాళ్లు సూచిస్తున్నారు.అయితే తారక్ వైపు నుంచి కూడా కష్టం ఉంటే మాత్రమే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.
2024 ఎన్నికల ప్రచారానికి తారక్ దూరంగా ఉండనున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.తారక్ కు రాజకీయాలపై( NTR Politics ) ఆసక్తి ఉందని పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే తారక్ రాజకీయాలకు సంబంధించి వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది.2029 ఎన్నికల నాటికి జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ కూడా బాగుందని ఏడాదికి ఒక సినిమా రిలీజయ్యేలా తారక్ ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. దేవర, వార్2( War 2 ) సినిమాలు పూర్తైన తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాకు తారక్ డేట్స్ కేటాయించనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తారక్ టీడీపీలో చేరి రాజకీయాలు చేసే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.







