జాజికాయ( Nutmeg ). దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.
ఘాటైన సుగంధద్రవ్యాల్లో జాజికాయ ఒకటి.ఇది వంటలకు చక్కని రుచి వాసన అందిస్తుంది.
అలాగే జాజికాయలో విటమిన్ బి6, ఫోలేట్, కాపర్, మెగ్నీషియం, ఫైబర్, థియామిన్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ జాజికాయ ద్వారా పొందవచ్చు.
జాజికాయలో ఔషధ గుణాలు సైతం మెండుగా ఉంటాయి.అందుకే ఆరోగ్యానికి జాజికాయ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
అయితే జాజికాయ మాత్రమే కాదు జాజికాయ నూనె( Nutmeg Oil )తోనూ బోలెడు ఆరోగ్య లాభాలు ఉన్నాయని మీకు తెలుసా.? అవును మీరు విన్నది నిజమే.ఔషధాలు, సౌందర్య సాధనలో జాజికాయ నూనెను ఉపయోగిస్తారు.అలాగే మోకాళ్ళ నొప్పులు, వాపులతో బాధపడే వారికి జాజికాయ నూనె చాలా అద్భుతంగా సహాయపడుతుంది.జాజికాయ నూనెను నిత్యం మోకాళ్ళకు అప్లై చేసి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.జాజికాయ నూనె సహజ నొప్పి నివారిణిగా పని చేస్తుంది.
వాపులను కూడా తగ్గిస్తుంది.
డిప్రెషన్( Depression ), ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను దూరం చేయడానికి జాజికాయ నూనె ఉపయోగపడుతుంది.
అందుకే రోమన్లు ఈ జాజికాయ నూనెను బ్రెయిన్ టానిక్ గా పిలిచేవారు.జాజికాయ నూనెను అరోమా థెరపీలో వాడితే ఒత్తిడి, ఆందోళన డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను సులభంగా అధిగమించవచ్చు.
ఇక ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో హాఫ్ టేబుల్ స్పూన్ జాజికాయ నూనె కలిపి స్నానం చేయాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే ఒళ్ళు నొప్పుల నుంచి( Body Pains ) ఉపశమనం లభిస్తుంది.బాడీ రిలాక్స్ అవుతుంది.మెదడు, మనసు ప్రశాంతంగా మారతాయి.అలసట దూరం అవుతుంది.అలాగే చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా మెరుస్తుంది.
అయితే జాజికాయ నూనె ప్రభావం చాలా వేడిగా ఉంటుంది.అందువల్ల ఎక్కువ మొత్తంలో వాడకూడదని నిపుణులు చెబుతున్నారు.