జోర్దార్ సుజాత( Sujatha ) పరిచయం అవసరం లేని పేరు జోర్దార్ వార్తల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమానికి వెళ్లారు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుజాత అనంతరం బుల్లితెరపై ప్రసారం అవుతున్నటువంటి పలు కార్యక్రమాలలో సందడి చేశారు.
ఈ క్రమంలోనే ఈమెకు జబర్దస్త్ కార్యక్రమంలో రాకింగ్ రాకేష్ టీమ్ లో అవకాశం లభించింది.ఈ విధంగా రాకింగ్ రాకేష్( Rocking Rakesh ) టీం లో తనతో కలిసి పలు స్కిట్లు చేస్తూ సందడి చేస్తున్నటువంటి సుజాత ఏకంగా రాకింగ్ రాకేష్ ప్రేమలో పడ్డారు.
ఇలా ప్రేమించుకున్నటువంటి వీరిద్దరూ జబర్దస్త్ వేదికగా తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టడమే కాకుండా ఈ ఏడాది మొదట్లో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకొని దంపతులుగా మారారు.ఇలా పెళ్లయినప్పటికీ సుజాత పలు బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా మారిపోయారు.

ఇక రాకింగ్ రాకేష్ సైతం యూట్యూబ్ ఛానల్( YouTube channel ) రన్ చేయడమే కాకుండా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు ఈయన హీరోగా కూడా సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.ఇక సుజాత కూడా సపరేట్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈమె తన ఇంట్లో జరిగే ప్రతి పూజా కార్యక్రమాలతో పాటు తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసుకుంటారు.ఇకపోతే రాకింగ్ రాకేష్ సుజాతల వివాహం జరిగిన తర్వాత మొదటి శ్రావణమాసం రావడం అలాగే ఈమె మొదటిసారి మంగళ గౌరీ వ్రతం( Mangala Gowri Vratham )జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అత్తగారింట్లో మొదటిసారి మంగళ గౌరీ వ్రతం జరుపుకున్నటువంటి వీడియోని సుజాత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ వీడియోలో భాగంగా మంగళ గౌరీ వ్రతం ప్రాధాన్యత ఏమిటి మంగళ గౌరీ వ్రతం ఎలా చేయాలి ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా తెలియజేశారు.

ఇక రాకింగ్ రాకేష్ బ్రాహ్మణ కుటుంబం కావడంతో వీరి ఇంట్లో ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తుంటారని పలు సందర్భాలలో సుజాత తెలియజేశారు.అయితే తను కూడా ఎప్పుడు మంగళ గౌరీ వ్రతం చేయలేదని మొదటిసారి ఈ పూజ చేస్తున్నానని తెలిపారు.ఇలా మంగళ గౌరీ వ్రతం చేయడం వల్ల పెళ్లికాని అమ్మాయిలకు పెళ్లి అవుతుందని పెళ్లి జరిగిన వారికి తమ భర్తలు క్షేమంగా ఉంటారు అంటూ సుజాత ఈ మంగళ గౌరీ వ్రతానికి సంబంధించిన వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.







