చిరంజీవి తమ్ముడి గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్( Pawan kalyan ) అతి తక్కువ సమయంలోనే పవర్ స్టార్ గా ఎదిగాడు.తనకంటూ ఇండస్ట్రీ లో ఒక గుర్తింపు సంపాదించాడు.కెరీర్ మొదట్లో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నీ కాస్త విభిన్నమైనవి.1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం తో ప్రేక్షకులకు పరిచయమై న పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం తోనే విజయాన్ని అందుకున్నాడు.ఆ తరువాత ఆయన వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది.తరువాత ఆయన నటించిన ఆరు సినిమాలు బ్లాక్ బ్లాస్టర్స్ గా నిలిచాయి.ఆ సినిమాలేమిటో ఇప్పుడు చూదాం.

పవన్ కళ్యాణ్ హీరోగా రాసి హీరోయిన్ గా ముత్యాల సుబ్బయ్య గారు తెరకెక్కించిన చిత్రం గోకులంలో సీత( Gokulamlo Seeta ).ఈ సినిమా 1997 లో విడుదలయ్యి మంచి విజయాన్ని సాధించింది.ఆ తరువాత 1998 లో సుస్వాగతం, అదే ఏడాది తొలిప్రేమ చిత్రాలతో సందడి చేసాడు పవన్ కళ్యాణ్.మళ్ళి 1999 లో తమ్ముడు( Thammudu ), 2000 లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బద్రి చిత్రాలలో నటించాడు.2001 ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఖుషి చిత్రంలో నటించాడు పవన్ కళ్యాణ్.ఈ ఆరు చిత్రాలు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఈ ఆరు హిట్లతో పవన్ కళ్యాణ్ డబల్ హ్యాట్రిక్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసినదే.కానీ ఆయన సినిమాలలో కూడా అదే జోరు చూపిస్తున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు( Hari Hara Veera Mallu ), సుజీత్ దర్శకత్వం లో ఓజి, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలలో నటిస్తున్నారు.అజ్ఞాతవాసి చిత్రం తరువాత పవన్ నటించిన చిత్రాలన్నీ రీమేక్ స్టోరీలే.
అందుకే మున్ముందు రాబోయే చిత్రాలు ఎలా ఉండబోతున్నాయి అన్న ఆసక్తి అభిమానులలో నెలకొని ఉంది.మరి ఈ చిత్రాలతో పవర్ స్టార్ మళ్ళి హ్యాట్రిక్ కొడతాడేమో వేచి చూడాలి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ OG సినిమాతో బిజీ గా ఉన్నాడు.