పుష్ప సినిమాతో అల్లు అర్జున్( Allu Arjun ) ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగిపోయింది.ఉన్నట్టుండి పాన్ ఇండియా స్టార్ ఐపోయాడు.
ఇప్పుడు తాజాగా నేషనల్ అవార్డు రావడంతో అభిమానంతో పాటు గౌరవం గుర్తింపు కూడా దక్కాయి.తెలుగు సినీ పరిశ్రమలో నేషనల్ అవార్డు సాధించిన మొదటి హీరోగా చరిత్ర సృష్టించాడు బన్నీ.
మరి ఇలాంటి స్టార్ పక్కన నటించడానికి ఎవరైనా నో చెప్తారా? అవకాశం రాగానే ఎగిరి గంతేసి ఎస్ చెప్పితీరుతారు.కానీ పరిస్థితి ఆలా లేదు.
ఇప్పటి ముగ్గురు స్టార్ హీరోయిన్లు అల్లు అర్జున్ తో నటించే ఆఫర్ ని రిజెక్ట్ చేశారట.అసలు విషయం ఏమిటంటే …

పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమా పాటలు కూడా మాస్ ఆడియన్స్ ని తెగ ఇంప్రెస్స్ చేసాయి. దేవి శ్రీ ప్రసాద్ కి దక్కిన నేషనల్ అవార్డు దీనికి రుజువు.
ఈ సినిమాలో “ఊ అంటావా మామ” పాట ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పుడు ఇలాంటి పాటే ఒకటి “పుష్ప 2( Pushpa 2 )” లో కూడా పెడదాం అని ఫిక్స్ అయ్యారు డైరెక్టర్ సుకుమార్.
అందుకోసం ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లను అడిగారట.కానీ ఎవ్వరు ఒప్పుకోలేదు.
కారణం “ఊ అంటావా మామ” పాట చేసాక సమంత పై వచ్చిన కామెంట్స్.

“ఊ అంటావా మామ” పాట చేసాక సమంతను ఐటెం గర్ల్ అని పిలుస్తున్నారట.ఈ విషయం సమంత( Samantha ) వరకు వెళ్ళింది.ఆమె కూడా అనవసరంగా ఈ పాట చేసానని చాలా బాధ పడుతుందట.
ఈ పరిస్థితే తమకు కూడా వస్తుందేమో అని భయపడుతున్నారట ఈ హీరోయిన్లు.ఐతే తాజాగా బాలీవుడ్ భామ దిశా పటాని ఈ పాట చేసేందుకు ఒప్పుకున్నారని సమాచారం.
కానీ మూవీ టీం ఆఫీసియల్ గా అనౌన్స్ చెయ్యలేదు.ఈ మూవీ షూటింగ్ సెర వేగంగా జరుగుతుంది.
రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తారు మేకర్స్.







