జమిలి ఎన్నికలు.. జంకుతున్న బీఆర్ఎస్..!!

రాబోవు కొన్ని నెలల్లో తెలంగాణ( Telangana ) రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.ఇదే తరుణంలో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ వారి యొక్క అభ్యర్థుల లిస్టును కూడా ప్రకటించింది.

 Jamili Elections Afraid Brs , Telangana Elections, Brs Party , Jamili Elections-TeluguStop.com
Telugu Brs, Cm Kcr, Congress, Jamili, Telangana-Politics

దీంతో లిస్టులో పేరు వచ్చిన అభ్యర్థులంతా ప్రచారంలో మునిగిపోయారు.ప్రజలకు చేరువయ్యేందుకు గడపగడప తిరుగుతున్నారు.ఈ క్రమంలోనే కేంద్రం జమిలి ఎన్నికల పేరుతో కొత్త తతంగాన్ని ముందట వేసుకుంది.దీంతో తెలంగాణ బీఆర్ఎస్( BRS ) నేతల్లో గుబులు పట్టుకుంది.జమిలి ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కు ఏం నష్టం.బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారు.? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.? ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి.అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ లో పార్లమెంటు ఎన్నికలు జరగాలి.ఇదే ప్రాసెస్ ప్రకారం బిఆర్ఎస్ కూడా 115 మంది లిస్టును ప్రకటించింది.దీంతో ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులంతా ప్రచార హోరులో మునిగిపోయారు.

Telugu Brs, Cm Kcr, Congress, Jamili, Telangana-Politics

ఇదే తరుణంలో కేంద్రం జమిలి ఎన్నికల( Jamili Elections ) కు పూర్తిగా సిద్ధమైతే మాత్రం, ఈ ఎన్నికలు రావడానికి సమయం అనేది ఇంకా పెరుగుతుంది.ఇప్పటికే రంగంలోకి దిగిన నేతలంతా జెమిలి ఎన్నికలకు అన్ని కసరత్తులు జరిగే దాకా ప్రచారం చేయవలసి ఉంటుంది.దీంతో ఖర్చు కూడా బాగానే పెట్టాల్సి ఉంటుంది.

అంతేకాకుండా జమిలి ఎలక్షన్స్ వస్తే ప్రస్తుత లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థుల పేరు బీఫామ్ తీసుకునేదాకా ఉంటుందా లేదా అనేది కూడా చాలామంది నేతల్లో ఆందోళన కలిగిస్తున్నట్టు తెలుస్తోంది.ఇదే విషయంపై సీఎం కేసీఆర్ ( KCR )ఇప్పటివరకు స్పందించలేదు.

జమిలి ఎన్నికలు వస్తే మాత్రం తప్పనిసరిగా బీఆర్ఎస్ కు నష్టం కలుగుతుందని చెప్పకనే చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube