ఆసియా కప్ 2023 ( Asia Cup 2023 )లో భాగంగా నేడు భారత్-పాకిస్తాన్ మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది.ఈ మ్యాచ్ ను వీక్షించటం కోసం భారత క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ భారత్- పాకిస్థాన్ మ్యాచ్ ( India-Pakistan match )ను OTT సబ్ స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా చూడాలి అని ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ గుడ్ న్యూస్ తెలిపింది.ఆసియా కప్ 2023 మ్యాచ్ లను ఉచితంగానే యూజర్ల కోసం అందించబోతున్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్( Disney Plus Hot Star ) ప్రకటించింది.
కొత్త సబ్ స్క్రైబర్లను ఆకర్షించడం కోసమే OTT ఫ్లాట్ ఫామ్ భారతీయులకు ఇష్టమైన క్రికెట్ మ్యాచ్లను ఉచితంగా ప్రసారం చేయడానికి సిద్ధమైంది.క్రికెట్ అభిమానులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఎటువంటి సబ్ స్క్రిప్షన్ లేకుండానే ఆసియా కప్ 2023 మ్యాచ్లను ఉచితంగా వీక్షించవచ్చు.

ఆసియా కప్ 2023 టోర్నీ పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా సెప్టెంబర్ 17 వరకు జరుగనున్న సంగతి తెలిసిందే.ఈ అన్ని మ్యాచ్లను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ యాప్ నుండి ఉచితంగా చూడవచ్చు కానీ మీరు కేవలం ఒక్క డివైస్ పైన స్టాండర్డ్ రిజల్యూషన్( Standard resolution ) (SD) లో మాత్రమే చూసే అవకాశం ఉంటుంది.ఒకవేళ మీరు ఆసియా కప్ మ్యాచ్లను HD (720p), FHD(1080p) లేదా మరింత ఎక్కువ క్లారిటీతో చూడాలనుకుంటే మాత్రం కచ్చితంగా మీరు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తీసుకోవలసి ఉంటుంది.రూ.899 చెల్లించి FHD సూపర్ ప్లాన్ పొందవచ్చు.నెలకు రూ.299 లేదా సంవత్సరానికి రూ.1499 చెల్లించి 4K ప్రీమియం ప్లాన్ పొందవచ్చు.నేడు శ్రీలంకలోని పల్లెకెలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం అవ్వనుంది.







