పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ తన 52వ పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఫ్యాన్స్ నుండి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల నుండి పుట్టిన రోజు విషెష్ అందుకున్నారు.
నెట్టింట ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు.ఈయన బర్త్ డే ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ రోజు పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ట్రీట్ కూడా భారీ లెవల్లో ప్లాన్ చేసారు.ఇప్పటికే ”హరిహర వీరమల్లు” నుండి అప్డేట్ వచ్చింది.
ఈ ఉహించని సర్ప్రైజ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.ఇక ఇప్పుడు ముందుగా చెప్పిన ప్రకారం ‘ఓజి’ ( OG )నుండి టీజర్ రిలీజ్ చేసారు.చెప్పినట్టుగానే మేకర్స్ ఈ టీజర్ ను 10.35 కు రిలీజ్ చేసి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.

టీజర్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.పవర్ స్టార్ ను గ్యాంగ్ స్టర్ గా సుజీత్( Sujeet ) చూపించిన తీరు ఆకట్టుకుంది.ఆయన ఆటిట్యూడ్, లుక్, యాక్షన్ మొత్తం కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా అనిపించాయి.ఇక ముంబై గ్యాంగ్ స్టర్ గా పవన్ ను చూపించారు.
థమన్ అందించిన బీజీఎమ్ వేరే లెవల్ లో ఉంది.ఈ టీజర్ మొత్తం పవర్ స్టార్ పాత్రను ఎలివేట్ చూపిస్తూ సుజీత్ చేసిన కట్ అదిరిపోయింది.

ఇది అసలు సిసలైన బర్త్ డే ట్రీట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.







