బండారి బాల్ రెడ్డి బిఆర్ ఎస్ పార్టీ( BRS party ) పట్టణ అధ్యక్షులు.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పూర్తి అయిన బూతు కమిటీ ల ఫైల్లను ఎల్లారెడ్డిపేట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వరస కృష్ణహారి కి అందజేశారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎనిమిది మంది బూత్ కమిటీ అధ్యక్షులను వంద మంది ఓటర్ల కు ఓక కార్యకర్త చొప్పున ఎనభై మంది బిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలను నియమించి పూర్తి చేసిన ఫైల్లను బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందె సుభాష్, ఎలగందుల నరసింహులు, గంట వెంకటేష్ గౌడ్ తదితరులు ఉన్నారు
.