భాజాపాకు వ్యతిరేకంగా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రతిపక్ష ఇండియా కూటమి( INDIA Alliance ) సమావేశాలు ముంబైలో ముగిశాయి.సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కీలక నేతలు భాజపా ప్రభుత్వంపై( BJP ) నిప్పులు చేరిగారు .
అధిక ధరలతో దేశాన్నిభాజపా భ్రష్టు పట్టించిందని ఈ అధిక ధరల భూతాన్ని తప్పించుకోవాలంటే భాజపానుగద్దే దించాల్సిందే అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శలు చేశారు.బజాపా నేతలు భగవంతుడు కన్నా తాము గొప్పవారి మని భావిస్తున్నారని,
ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ ప్రభుత్వానికి మనుగడ ఉండదని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
మరో నేత నితీష్ కుమార్( Nitish Kumar ) మాట్లాడుతూ మోడీ సర్కారుకు పతనం మొదలైందని ,అందుకే పార్లమెంటు రద్దు లాంటి చర్యల ద్వారా ఎన్నికలను ముందస్తుగా తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తుందని.బాజాపా ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇండియా కూటమి దానికి సిద్ధంగానే ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఆమ్ ఆద్మీ నేత కేజ్రీవాల్( Kejriwal ) మాట్లాడుతూ ఇది పార్టీల కూటమి కాదని, బాజాపా పాలన తో విసుగు చెందిన 140 కోట్ల రక్షణ కోసం కట్టిన కూటమి అని ఇక్కడ ఎవరూ పదవుల కోసం కూటమి కట్టలేదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసమే ఈ కలయిక అంటూ ఆయన చెప్పుకొచ్చారు .వ్యవస్థలన్నిటిని తన రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న భాజపాకు భారత ప్రజలు గట్టి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు.

కేవలం ప్రజాగ్రహానికి భయపడే గ్యాస్ ధరలు ఎన్నికల సమయంలో తగ్గించారని శివసేన నేత ఉద్దవ్ థాకరే( Uddhav Thackeray ) వ్యాఖ్యానించారు.ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇండియా కూటమి ప్రభంజనాన్ని అడ్డుకోలేరని బిజేపి ఎత్తులన్నీ చిత్తు చేసి ఉమ్మడి గా అదికారం లోకి వచ్చి ప్రజాస్వామ్య విలువను కాపాడతామని ఆయన ఈ సందర్భంగా చెప్పుకోచ్చారు.