Babu Mohan: కోటా అన్నకు అసూయ ఎక్కువ.. బ్రహ్మానందం కనపడని కత్తి.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వీరు ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ తమదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న విషయం తెలిసిందే.

 Babu Mohan About Kota Srinivasarao And Brahmanandam-TeluguStop.com

అప్పట్లో ఈ కమెడియన్లు( Comedians ) లేని సినిమా అంటూ ఉండేది కాదు.ఇంకా చెప్పాలంటే అప్పట్లో దర్శకులు హీరో హీరోయిన్ల డేట్లు కంటే కమెడియన్ డేట్స్ కోసం కూడా ఎదురుచూసేవారు.

ఇందులో కోటా, బాబు మోహన్ లది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.వీరిద్దరి కాంబినేషన్లో కామెడీ సన్నివేశం వచ్చింది అంటే ప్రేక్షకులు కడుపుబ్బానవ్వాల్సిందే.

ప్రస్తుతం కోటా శ్రీనివాసరావుకు( Kota Srinivasa Rao ) వయసు మీద పడడంతో సినిమాలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు కేవలం ఇంటర్వ్యూలలో మాత్రమే పాల్గొంటున్నారు.

బాబు మోహన్ డ్రామా జూనియర్స్ అనే షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

ఇక గతంలో బాబు మోహన్( Babu Mohan ) కోటా గురించి, బ్రహ్మానందం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా బ్రహ్మానందం( Brahmanandam ) మాట్లాడుతూ.

కోటా అన్నకు అసూయ ఎక్కువ.ఎవరైనా తనకన్నా ఎక్కువ ఉంటే తట్టుకోలేడు.

నేను మంత్రి అయ్యాక వెనుక ఇద్దరు గన్ మెన్ లు వచ్చేవారు.ఆ సమయంలో అడపాదడపా షూటింగ్ చేసేవాడిని.

షూటింగ్ లో కూడా గన్ మేన్స్ వచ్చేవారు.ఇక వారిని చూసి అన్న ఏరా.గన్ మెన్ లా అంటూ పెదవి విరిచేవాడు.ఆయన మనసులో ఏం పడ్డది అంటే రాజకీయాల్లోకి వెళితే తనకు కూడా గన్ మెన్ లు ఉంటారని రాజకీయాల్లోకి వచ్చాడు.

Telugu Babu Mohan, Brahmanandam, Tollywood-Movie

ఆ తరువాత నా దగ్గరకు వచ్చి నాకు గన్ మెన్స్ ఉన్నారని చెప్పాడు.ఇక నేనెప్పుడూ అసెంబ్లీ( Assembly ) మానేవాడిని కాదు.రోజు వెళ్లి వాళ్ళు చెప్పేది వినేవాడిని.కోటా అన్న ఎక్కడో ఒక మూల కూర్చునేవాడు.నేను నా ప్లేస్ లో కూర్చొనేవాడిని.అసెంబ్లీకి రావడం ఆలస్యం రారా నాపక్కన కూర్చో అనేవాడు.

లేదన్నా నాకు అక్కడ ప్లేస్ ఉంది అంటే, ఏరా నా పక్కన కూర్చోకూడదా? మనం ఉన్నన్నిరోజులు ఒకే దగ్గర కూర్చుందాం అని చెప్పాడు.ఇక రోజు నేను కూడా అక్కడే కూర్చొనేవాడిని.

ఆ తరువాత నేను క్యాబినెట్ మంత్రిని అయ్యాను.అసెంబీలో మొదటి వరుసలో కూర్చోవాలి.

ఆరోజు కోటా అన్న పిలిస్తే నేను ఇదే విషయం చెప్పాను.

Telugu Babu Mohan, Brahmanandam, Tollywood-Movie

నువ్వు ఎమ్మెల్యే( MLA ) నేను క్యాబినెట్ మంత్రి అక్కడే కూర్చోవాలి అంటే.ఎందుకురా మంత్రి పదవి మనం ఎమ్మెల్యేలుగా ఉంటే ఎంత బావుంటుందిరా అనేవాడు.లేదన్నా.

అక్కడ క్యాబినెట్ మంత్రి( Cabinet Minister ) అని నేను వెళ్లి నా సీట్ లో కూర్చునేవాడిని.ఇక అర్రే నేను బీజేపీ మంత్రి కాలేను అని కుళ్ళుకోని తరువాతి రోజు నుంచి ఆయన అసెంబ్లీకి రాలేదు.

కేవలం నాకు గన్ మెన్ లు ఉన్నారు.ఆయనకు లేరు అని వారికోసం రాజకీయాల్లోకి వచ్చాడు అని చెప్పుకొచ్చారు బ్రహ్మానందం.

బ్రహ్మానందం గురించి బాబు మోహన్ మాట్లాడుతూ.బ్రహ్మానందం కనపడని కత్తి.

ఎక్కడ కోశాడు.ఎలా కోశాడు అనేది తెలియదు.

రక్తం రావడం మాత్రమే తెలుస్తుంది అని తెలిపారు బాబు మోహన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube