ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మదగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసిన ప్రతి ఒక వ్యక్తి కూడా ఇప్పుడు ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకుంటు వస్తున్నారు.అయితే కొందరు మాత్రం అంత గుర్తింపు తెచ్చుకోవడం లో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి అలాంటి వాళ్లలో శివ నాగేశ్వరరావు( Shiva nageshwara rao ) ఒకరు…ఈయన గురించి మనందరికీ తెలుసు ఈయన శివ సినిమాకి కో డైరెక్టర్ గా పనిచేసిన విషయం కూడా మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్లలో ఆయన ఒక మంచి డైరెక్టర్ అనే చెప్పాలి ఈయన చిన్నపిల్లాడు గా ఉన్న అఖిల్ ని మెయిన్ లీడ్ గా పెట్టీ తీసిన సిసింద్రీ సినిమా( Sisindri Movie ) అప్పట్లో సూపర్ హిట్ గా నిలించింది.ఇక ఈయన డైరెక్షన్ లో వచ్చిన కొన్ని సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ ఈయనకి ఇండస్ట్రీ లో అంత గుర్తింపు అయితే రాలేదు కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఎందుకు ఈయన స్టార్ డైరెక్టర్ కాలేకపోయాడు అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం.

ఈయన అప్పట్లో చేసిన సినిమాలు అన్నీ కూడా జేడి చక్రవర్తి హీరో గా చేసిన సినిమాలు లేదంటే చిన్న చిన్న నటులను పెట్టుకొని చేసిన సినిమాలే ఎక్కువగా ఉండటం వల్ల ఈయన చేసిన సినిమాలు అన్నీ కూడా పెద్ద విజయాలను సాధించలేకపోయాయి ఆయన పెద్ద హీరోలతో సినిమాలు చేసి ఉంటే ఆయన కూడా పెద్ద డైరెక్టర్ అయ్యేవాడు…అందుకే సినిమా ఇండస్ట్రీ లో మన కంటే వెనక వచ్చిన వాళ్ళు కూడా స్టార్ డైరెక్టర్లు అయిపోవచ్చు మనం మాత్రం అక్కడే ఉండిపోవలసి వస్తుంది…ఇక ఈయన మాత్రం ఒక డిఫరెంట్ టేస్ట్ ఉన్న డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు…

ఈయన తోపాటు వర్మ( Ram Gopal Varma ) దగ్గర నుంచి బయటికి వచ్చి డైరెక్టర్లు అయిన వాళ్లలో కృష్ణవంశీ,గుణశేఖర్,పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు టాప్ డైరెక్టర్లు గా పేర్లు తెచ్చుకున్నారు కానీ ఈయన మాత్రం ఇంకా నార్మల్ డైరెక్టర్ గానే కొనసాగుతున్నారు… ఇక ఈయన ఒకవేళ స్టార్ డైరెక్టర్ కావాలన్న కూడా స్టార్లతో సినిమాలు ప్లాన్ చేసుకోవాలి అయితే ఈయన అలా స్టార్లతో సినిమాలు ప్లాన్ చేయడం లో చాలా వరకు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి…
.







