సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలకు మేనేజర్లు ఉంటారనే విషయం మనకు తెలిసిందే.సెలబ్రిటీలకు సినిమా అవకాశాలు రావాలన్నా వారి కాల్ షీట్స్ చూసుకోవాలన్న, వారి ఆర్థిక లావాదేవీలు అన్నింటిని చూసుకోవాలన్న మేనేజర్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.
అయితే ఇదే అదనుగా భావించి కొంతమంది మేనేజర్లు సెలబ్రిటీలను భారీ స్థాయిలో మోసం చేస్తూ డబ్బు పోగు చేసుకుంటూ ఉంటారు.ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల మేనేజర్లు చేసినటువంటి మోసం బయటపడటంతో సదురు మేనేజర్లపై చర్యలు తీసుకున్నటువంటి సెలబ్రిటీలకు కూడా ఉన్నారు.
అయితే తాజాగా నటి సమంత ( Samantha )కూడా మేనేజర్ చేతిలో మోసపోయింది అని తెలుస్తుంది.

ఇప్పటికే నాగచైతన్య ( Nagachaitanya ) విడాకులు ఇవ్వడం మయో సైటిసిస్ వ్యాధి బారిన పడటం వంటి సమస్యల ద్వారా ఎంతో సతమతమవుతున్నటువంటి సమంతకు మరొక దెబ్బ పడటం అంటే కోలుకోలేని విషయం అనే చెప్పాలి.సమంత వద్ద ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నటువంటి మేనేజర్ ఆమె వద్ద ఏకంగా కోటి రూపాయలు నొక్కేయడానికి భారీగానే స్కెచ్ వేశారన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సమంత ఖుషి ( Kushi )సినిమాలో నటించిన తర్వాత సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా కారణంగా తాను ప్రమోషన్లకు రాకపోవడం అలాగే తన ఆరోగ్యం బాగా లేనప్పుడు సినిమా షూటింగ్ వాయిదా పడటం వల్ల నిర్మాతలు ఎంతో ఇబ్బంది పడ్డారన్న విషయాన్ని దృష్టిలో తీసుకున్నటువంటి సమంత కోటి రూపాయల రెమ్యూనరేషన్ వెనక్కి తిరిగి ఇవ్వమని తన మేనేజర్ కి సూచించారట.

సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో పెద్దగా ఈ కోటి రూపాయల గురించి పట్టించుకోదని భావించినటువంటి మేనేజర్ ఆ కోటి రూపాయలు నొక్కేసే ప్రయత్నం చేశారు.అయితే నిర్మాతల వద్ద సమంత మేనేజర్ పూర్తి రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా ఆ కోటి రూపాయలు తనకు లిక్విడ్ క్యాష్ రూపంలో కావాలని చెప్పారట.అయితే లిక్విడ్ క్యాష్ ఇవ్వలేమని నిర్మాతలు చెప్పడంతో సదురు మేనేజర్ తన ఫ్రెండ్స్ అకౌంట్ నెంబర్స్ ఇవ్వడంతో అనుమానం వచ్చినటువంటి నిర్మాతలు సమంతను సంప్రదించడంతో అసలు మోసం బయటపడిందని దీంతో సదరు మేనేజర్ పై చర్యలు తీసుకోవడానికి సమంతా సిద్దంగా ఉన్నారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే సదరు మేనేజర్ లేదా సమంత స్పందించాల్సి ఉంది.







