చిరంజీవి పూజ గదిలో అల్లు రామలింగయ్య ఫోటో... దైవ స్థానం కల్పించిన చిరు!

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ఒకరు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచినటువంటి చిరంజీవి కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని రియల్ హీరో అనిపించుకున్నారు.

 These Two Persons Photos In Chiranjeevi Pooja Gadhi Details, Chiranjeevi , Pooja-TeluguStop.com

ఈ విధంగా చిరంజీవి వ్యక్తిగత జీవితంలోను వృత్తిపరమైన జీవితంలోనూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

Telugu Chiranjeevi, Pooja Gadhi, Rakhi Festival, Venktarao-Movie

ఇకపోతే రాఖీ పండుగ (Rakhi Festival)సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు ఆయన ఇంటికి వచ్చి చిరంజీవికి రాఖీ కట్టడమే కాకుండా ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు.అయితే ఈ రాఖీ పండుగ సందర్భంగా ఇప్పటివరకు చిరంజీవి గురించి తన పూజ గది గురించి ఎవరికి తెలియనటువంటి ఒక రహస్యం బయటపడింది.ఈ రాకి వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చిరంజీవి తన ఇద్దరు చెల్లెలు చిరంజీవికి తన పూజ గదిలో రాఖీలు కట్టారు.దీంతో పూజ గదికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

Telugu Chiranjeevi, Pooja Gadhi, Rakhi Festival, Venktarao-Movie

ఈ పూజ గదిలో చిరంజీవి దేవుళ్ళ ఫోటోతో పాటు తమకు దైవ సమానమైనటువంటి తన తండ్రి వెంకట్రావు (Venktarao)అలాగే తన మామయ్య అల్లు రామలింగయ్య(Allu Ramalingaiah)ఫోటోలను కూడా పెట్టి పూజలు చేస్తున్నారనే విషయం తాజాగా బయటపడింది.ఒకరు చిరంజీవికి జన్మనిచ్చి తనని ఎంతో క్రమశిక్షణగా పెంచిన తండ్రి కాగా మరొకరు పిల్లనిచ్చి తన కెరియర్ ఎదుగుదలకు ఎంతో ప్రోత్సాహాన్ని కల్పించిన మామగారు.ఇలా వీరిద్దరూ మరణించడంతో వారిని దైవ సమానంగా భావించి చిరంజీవి ఏకంగా వారి చిత్రపటాలను పూజ గదిలో పెట్టుకుని పూజిస్తున్నారని విషయం తెలియడంతో ఈ వార్త కాస్త వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube