దేశ రాజధాని ఢిల్లీ( Delhi )లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగి గుర్తుతెలియని దుండగుల చేతులలో దారుణ హత్యకు గురయ్యాడు.మృతుడిని హర్ ప్రీత్ గిల్ గా గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.ఢిల్లీకి చెందిన హర్ ప్రీత్ గిల్ (36)( Harpreet ) అనే వ్యక్తి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఆమెజాన్ లో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.తాజాగా మంగళవారం రాత్రి 11:30 గంటలకు తన మేనమామతో కలిసి భజన్ పురలోని సుభాష్ విహార్ ప్రాంతంలో బైక్ పై వెళుతుండగా గుర్తుతెలియని దుండగులు బైక్ లపై వచ్చి హర్ ప్రీత్ గిల్ ను అడ్డగించి కాల్పులు జరిపారు.వెంటనే అక్కడి నుండి ఆ దుండగులు పరారయ్యారు.వీరిని గుర్తించిన స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గిల్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.అతని మేనమామకు చికిత్స అందిస్తున్నారు.

పోలీసులకు( Police ) సమాచారం అందించడంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు మృతుడి మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.ఆ ఫిర్యాదులో ఐదుగురు వ్యక్తులు తనపై, తన మేనల్లుడిపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు.హర్ ప్రీత్ గిల్ ఇంటి నుండి బయటకు వెళ్తూ పది నిమిషాలలో తిరిగి వస్తానని తన తల్లిదండ్రులకు చెప్పి బయటకు వచ్చాడు.
దుండగులు కాల్పులు చేయడం వల్ల గిల్ తలపై కుడివైపు బుల్లెట్ గాయాలను పోలీసులు గుర్తించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
మృతుడి మేనమామ భజన్ పురా కు చెందిన నివాసి.ఇతని తలకు కూడా గాయాలు కావడంతో లోక్ నాయక్ జై ప్రకాష్ ఆసుపత్రిలో చేర్పించారు.
దుండగుల ముఠాను ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.







