ఐకాన్ స్టార్ 'పుష్ప 2' నుండి ఆ డైలాగ్ లీక్.. ఈసారి అరుపులే!

ఈ రోజు ఉదయం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) నుండి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సుర్ప్రైజింగ్ వీడియో వచ్చిన విషయం తెలిసిందే.ఈ అప్డేట్ కోసం ముందుగానే చెప్పడంతో ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూసారు.

 Allu Arjun Leaks A Dialogue From Pushpa 2, Pushpa The Rule, Pushpa 2, Tollywood-TeluguStop.com

మరి ఈ రోజు ఉదయమే ఒక వీడియో రిలీజ్ చేసారు.ఇంస్టాగ్రామ్ తో అల్లు అర్జున్ కొలాబరేట్ అయి వీడియో రిలీజ్ చేసారు.

Telugu Allu Arjun, Alluarjun, Pushpa, Pushpa Rule, Sukumar, Tollywood-Movie

ఈ వీడియోలో అల్లు అర్జున్ తన డేను స్టార్ట్ చేసినప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు ఉంది.అలాగే ప్రజెంట్ రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరుగుతుందని అక్కడ షూట్ కోసం ఎలా రెడీ అయ్యాడు షూట్ ఎలా చేస్తున్నారు అనేది చూపించి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ వీడియో ట్రీట్ ఇచ్చాడు.పుష్ప సినిమా షూట్ నుండి ఒక వీడియో రావడంతో ఫ్యాన్స్ మాములుగా ఎగ్జైట్ అవ్వలేదు.ఈ వీడియో మొత్తం ఆకట్టుకుంది.ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్పలా మారిన ట్రాన్ఫర్మేషన్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా అనిపించింది.సుకుమార్ చిన్న సీక్వెన్స్ ను షూట్ చేయడం షూటింగ్ స్పాట్ నుండి దానిని రివీల్ చేయడం ఆసక్తిగా మారాయి.

అయితే ఈ చిన్న వీడియోలో సుకుమార్, అల్లు అర్జున్( Sukumar ) స్టోరీ డిస్కర్షన్ లో ఉండగా స్క్రిప్ట్ పేపర్ కూడా కనిపించింది.

Telugu Allu Arjun, Alluarjun, Pushpa, Pushpa Rule, Sukumar, Tollywood-Movie

ఆ స్క్రిప్ట్ పేపర్ లో ఉన్న డైలాగ్ ను స్క్రీన్ షాట్ తీసి ఆడియెన్స్ షేర్ చేస్తున్నారు.ఇందులో ఒక డైలాగ్ వైరల్ అయ్యింది.”ముందు నీకు షకావత్ కే గొడవ మచ్చా.ఇప్పుడు సిండికేట్ కూడా ఇంవోల్వ్ అయ్యింది” అంటూ కేశవా గురించి రాసిన డైలాగ్ నెట్టింట వైరల్ అవుతుంది.దీంతో ఈసారి పుష్పరాజ్ కు షకావత్ కు మధ్య డైలాగ్స్ అండ్ యాక్షన్ మాములుగా ఉండదని అంటున్నారు.

కాగా ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube