Supriya Yarlagadda : రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన సుప్రియ యార్లగడ్డ.. అసలేం జరిగిందంటే?

ఛాయ్ బిస్కెట్( Chai Bisket ) అనే సంస్థను స్థాపించి షార్ట్ ఫిలింస్‌తో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ ఇప్పుడు ఫీచర్ ఫిలింస్ తీసే స్థాయికి ఎదిగారు నిర్మాతలు శరత్, అనురాగ్.ఇటీవల మేమ్ ఫేమస్ అనే సినిమాతో సుమంత్ ప్రభాస్ అనే హీరో కమ్ దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

 Supriya Yarlagadda Talks About Boys Hostel Movie Negitive Reviews-TeluguStop.com

తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో ఉన్న టాలెంట్‌ను ఇక్కడకు తీసుకురావాలనే ఉద్దేశంతో తాజాగా కన్నడ సినిమా హాస్టల్ హుడుగారు బేకగిద్దరే సినిమాను అనువాదం చేసి బాయ్స్ హాస్టల్ పేరుతో విడుదల చేశారు.ఈ సినిమాను తెలుగులోకి తీసుకురావడానికి పెద్ద సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌తో చేతులు కలిపారు.

ఆగస్టు 26న బాయ్స్ హాస్టల్ సినిమా( Boys Hostel ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.యూనిక్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది.

Telugu Hostel-Movie

ఇదిలా ఉంటే బాయ్స్ హాస్టల్ సినిమా చూడడానికి వెళ్లిన ఒక విమర్శకుడిని నిర్మాత శరత్( Producer Sharat ) బెదిరించారని ఈ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసింది.గతంలో మేమ్ ఫేమస్ సినిమాకు చెత్త రివ్యూ ఇచ్చాడనే కోపంతో సదరు విమర్శకుడిపై నిర్మాత శరత్ విరుచుకుపడ్డారని టాక్.దీనిపై సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరిగింది.Kaగా తాజాగా బాయ్స్ హాస్టల్ టీమ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది.తమ సినిమాను మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రేపు ఒక్కరోజు 1+1 టికెట్ ఆఫర్ పెడుతున్నట్టు ప్రకటించింది.ఈ ప్రెస్ మీట్‌లో ఒక జర్నలిస్ట్ శరత్‌, అను‌రాగ్‌కు ప్రశ్న సంధించారు.

నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నవారిని మీరు బెదిరిస్తున్నారంట కదా అని అడిగారు.
దీనికి శరత్ స్పందించబోగా నిర్మాత సుప్రియ యార్లగడ్డ( Supritha Yarlagadda ) అడ్డుపడి శరత్ బదులు ఆమె సమాధానం తెలిపింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.వీళ్లకు గిర్ అండి.మనం ఏదైనా అని ఒక లాజిక్ చెప్తే వెంటనే మనకు రెండు లాజిక్కులు ఎదురుచెప్తారు.అలా చెప్పేంత వరకు తనకి నిద్ర పట్టదు.

అది చెప్పాలి.ఆ పాయింట్ ప్రూవ్ చేసుకోవాలి అని సుప్రియ సమాధానం చెప్పారు.

ఇంతలోనే మరో రిపోర్టర్ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటున్నారో, నెగిటివ్‌గా మాట్లాడినప్పుడు తీసుకోగలగాలి, అలా ఉన్నప్పుడే ఇండస్ట్రీలో ఉండాలి అని అడగగా.దీనికి సుప్రియ వివరణ ఇస్తూ.

తీసుకోలేకపోయే పరిస్థితి మీరు అసలు కల్పించరు సార్.తీసుకోవాల్సిందే.

మేం సినిమా తీసి మీ ముందు పెట్టినప్పుడు దానికి మీరే ప్రచారకర్తలు.

Telugu Hostel-Movie

సినిమాను ఆడియన్స్ వద్దకు తీసుకెళ్లేవాళ్లు మీరు.ఒకప్పుడు సినిమా తీశాం అంటే.మంచి సినిమా తీశాం అని అనుకునేవాళ్లం.

ఇప్పుడు అలా లేదు.మంచి సినిమా తీస్తే దాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి మీరు కావాలి.

మీతోపాటు మాకు ఒక 10 మార్కెటింగ్ ప్లాన్లు కావాలి.ఎన్ని సినిమాలకు ఎన్ని మార్కెటింగ్ ప్లాన్లు పెడతామండి.

ఒకసారి ట్రైన్ తిప్పమంటారు, బస్సు తిప్పమంటారు, పాపం 25 థియేటర్లు తిప్పమన్నారంట.ఇదే చేసుకుంటూ వచ్చాం.

కానీ, ఇదంతా ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లేదెవరు? మీరేకదండి! కొన్నిసార్లు మీరూ మమ్మల్ని భయపెడుతున్నారు కదా సార్ అంటూ రిపోర్టర్ కు అలాగే నెటిజన్స్ కి అదిరిపోయే రేంజ్ లో సమాధానం ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube