25 ఏళ్ల లోపు పెళ్లి చేసుకున్నవారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన చైనా?

ఒకప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదని అడగగానే అందరి నోటా ఠక్కున చైనా( China ) అని వచ్చేది.కానీ ఇపుడు పరిస్థితి మారింది.

 China Announced Bumper Offer For Those Who Get Married Under The Age Of 25 Detai-TeluguStop.com

ఎందుకంటే ఇటీవలే ఇండియా( India ) చైనాని వెనక్కి నెట్టేసి అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది మరి.అయితే చైనాలో గతంలోనే తమ దేశ జనాభా తగ్గించుకునేందుకు వన్ చైల్డ్ పాలసీని( World Child Policy ) తీసుకురాగా అదే ఇపుడు వారి కొంప ముంచింది.ఈ క్రమంలోనే ఆ విధానాన్ని వారు ఎత్తివేయడం జరిగింది.అయితే చైనాలో చూసుకుంటే ఇప్పుడు అక్కడ యువత కంటే వృద్ధులే ఎక్కువగా ఉన్నారనే విషయం అందరికీ తెలిసినదే.

Telugu China, China Reward, Reward, Child Policy-Latest News - Telugu

ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం అక్కడి జనాభామీద ఓ కన్నేసింది.ఈ నేపథ్యంలో చైనాలోని స్థానిక యంత్రాంగాలు కీలక చర్యలకు పాల్పడుతున్నాయి.జననాల రేటు( Birth Rate ) పెంచే దిశగా పనిచేస్తున్నాయి.దీంతో తాజాగా స్థానిక యంత్రాగం మరో నిర్ణయం తీసుకుంది.25 లేదా అంతకంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకుంటే యువతులకు రివార్డు అందజేస్తామని ఊరిస్తోంది.జెజియాంగ్ అనే రాష్ట్రంలో చాంగ్షాన్ కౌంటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Telugu China, China Reward, Reward, Child Policy-Latest News - Telugu

ప్రస్తుతం చైనాలో

140 కోట్లకు పైగా జనాభా

ఉండగా ఈ మధ్య అక్కడ జననాల రేటు విపరీతంగా తగ్గిపోవడం అందరిని కలచివేస్తోంది.ఇందుకోసమే యువతులు తగిన వయసులో పెళ్లి( Marriage ) చేసుకుని.పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు చాంగ్షాన్ కౌంటి ఈ నగదు ప్రోత్సహకాన్ని తీసుకొచ్చింది.ఈ పధకం కింద 25 లేదా అంతకంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకున్నట్లైతే ఆ యువతులకు ఈ నగదును అందించనుంది.

ఇక్కడ మరో విషయం ఏంటంటే.వారు చేసుకోబోయే పెళ్లి కూడా మొదటిదై ఉండాలి సుమా.

నగదు పథకం కింద వెయ్యి యువాన్లను అందజేస్తారు.అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 11,341 రూపాయలన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube