25 ఏళ్ల లోపు పెళ్లి చేసుకున్నవారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన చైనా?
TeluguStop.com
ఒకప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదని అడగగానే అందరి నోటా ఠక్కున చైనా( China ) అని వచ్చేది.
కానీ ఇపుడు పరిస్థితి మారింది.ఎందుకంటే ఇటీవలే ఇండియా( India ) చైనాని వెనక్కి నెట్టేసి అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది మరి.
అయితే చైనాలో గతంలోనే తమ దేశ జనాభా తగ్గించుకునేందుకు వన్ చైల్డ్ పాలసీని( World Child Policy ) తీసుకురాగా అదే ఇపుడు వారి కొంప ముంచింది.
ఈ క్రమంలోనే ఆ విధానాన్ని వారు ఎత్తివేయడం జరిగింది.అయితే చైనాలో చూసుకుంటే ఇప్పుడు అక్కడ యువత కంటే వృద్ధులే ఎక్కువగా ఉన్నారనే విషయం అందరికీ తెలిసినదే.
"""/" /
ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం అక్కడి జనాభామీద ఓ కన్నేసింది.
ఈ నేపథ్యంలో చైనాలోని స్థానిక యంత్రాంగాలు కీలక చర్యలకు పాల్పడుతున్నాయి.జననాల రేటు(
Birth Rate ) పెంచే దిశగా పనిచేస్తున్నాయి.
దీంతో తాజాగా స్థానిక యంత్రాగం మరో నిర్ణయం తీసుకుంది.25 లేదా అంతకంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకుంటే యువతులకు రివార్డు అందజేస్తామని ఊరిస్తోంది.
జెజియాంగ్ అనే రాష్ట్రంలో చాంగ్షాన్ కౌంటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
"""/" /
ప్రస్తుతం చైనాలో H3 Class=subheader-style140 కోట్లకు పైగా జనాభా/h3p ఉండగా ఈ మధ్య అక్కడ జననాల రేటు విపరీతంగా తగ్గిపోవడం అందరిని కలచివేస్తోంది.
ఇందుకోసమే యువతులు తగిన వయసులో పెళ్లి( Marriage ) చేసుకుని.పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు చాంగ్షాన్ కౌంటి ఈ నగదు ప్రోత్సహకాన్ని తీసుకొచ్చింది.
ఈ పధకం కింద 25 లేదా అంతకంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకున్నట్లైతే ఆ యువతులకు ఈ నగదును అందించనుంది.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.వారు చేసుకోబోయే పెళ్లి కూడా మొదటిదై ఉండాలి సుమా.
నగదు పథకం కింద వెయ్యి యువాన్లను అందజేస్తారు.అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 11,341 రూపాయలన్నమాట.
ఆ సినిమా కథ చెబితే తెలుగు హీరోలందరూ రిజెక్ట్ చేశారు: వెంకీ అట్లూరి